‘పాయిజన్’ రెగ్యులర్ షూటింగ్ స్టార్టయింది
ABN , First Publish Date - 2020-10-25T02:53:59+05:30 IST
ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్‌విఆర్ మీడియా శోభారాణి తనయుడు రమణని హీరోగా పరిచయం చేస్తూ సిఎల్ఎన్ మీడియా పతాకంపై రవిచంద్రన్ దర్శకత్వంలో కె. శిల్పిక, ప్రవల్లిక నిర్మిస్తోన్న డిఫరెంట్

ప్రముఖ నిర్మాణ సంస్థ ఎస్‌విఆర్ మీడియా శోభారాణి తనయుడు రమణని హీరోగా పరిచయం చేస్తూ సిఎల్ఎన్ మీడియా పతాకంపై రవిచంద్రన్ దర్శకత్వంలో కె. శిల్పిక, ప్రవల్లిక నిర్మిస్తోన్న డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం 'పాయిజన్'(వర్కింగ్ టైటిల్). సిమ్రన్, సారిక, అర్ఛన, శివణ్య హీరోయిన్లుగా నటిస్తుండగా, నటుడు షఫీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం హైదరాబాద్ సంస్థ కార్యాలయంలో పూజా కార్యక్రమాలతో శనివారం ప్రారంభమైంది. తొలి సన్నివేశాన్ని హీరో రమణ, హీరోయిన్స్ సిమ్రన్, సారిక, అర్ఛన, శివణ్యలపై తెరకెక్కించారు దర్శకుడు రవిచంద్రన్. ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్లుగా చిత్రయూనిట్ పేర్కొంది.
చిత్ర నిర్మాతలు కె.శిల్పిక, ప్రవల్లిక మాట్లాడుతూ.. ''ఈ కరోనా లాక్‌డౌన్ తర్వాత ఒక కొత్త మూవీని ప్రకటించడం చాలా హ్యాపీగా ఉంది. ఈ చిత్రానికి మంచి సబ్జెక్ట్‌తో పాటు మంచి ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులతో కూడిన టీమ్ కుదిరింది. తప్పకుండా ఆడియన్స్‌కి ఒక ఫీల్‌గుడ్ మూవీ అవుతుందనే నమ్మకం ఉంది.." అని తెలుపగా.. సిఎల్ఎన్ మీడియా సంస్థ ద్వారా హీరోగా పరిచయం అవుతున్నందుకు లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలు శిల్పిక, ప్రవల్లిక గారికి, అలాగే సిరాజ్‌గారికి నా ధన్యవాదాలు. ప్రతి ఒక్కరిని ఎంటర్టైన్ చేస్తూనే అనుక్షణం ఉత్కంఠకు గురిచేసే సబ్జెక్ట్. నా బెస్ట్ పెర్‌ఫామెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను.. అని తెలిపారు హీరో రమణ.
దర్శకుడు రవిచంద్రన్ మాట్లాడుతూ.. ''ఈ మూవీ ఒక డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్. ఫ్యాషన్ ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో ప్రతిక్షణం ఉత్కంఠభరితంగా సాగుతుంది. శోభారాణిగారు నిర్మాణంలో మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. ఆమెకి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఫ్యాషన్ ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్ కథ కాబట్టి ఎంతో మంది థియేటర్ ఆర్టిస్టులను ఆడిషన్ చేసి హీరో హీరోయిన్లను ఎంచుకోవడం జరిగింది. ఈ సబ్జెక్ట్‌కి హీరో రమణ పర్‌ఫెక్ట్ చాయిస్. అలాగే ఈ సినిమాలో ప్రముఖ దర్శకుడు బాలా గారి దగ్గర వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ ముత్తు కుమరన్ గారి విజువల్స్ థ్రిల్ చేస్తాయి. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు" అన్నారు.

Read more