దూసుకెళుతోన్న రష్మిక ‘పొగరు’ సాంగ్

ABN , First Publish Date - 2020-08-07T03:14:37+05:30 IST

యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు, క‌న్న‌డ చిత్ర‌సీమ‌లోని స్టార్ యాక్ట‌ర్ల‌లో ఒక‌రైన ధ్రువ స‌ర్జా హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియ‌న్ ఫిల్మ్ ‘పొగ‌రు’. తెలుగులోనూ ఇదే పేరుతో

దూసుకెళుతోన్న రష్మిక ‘పొగరు’ సాంగ్

యాక్ష‌న్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు, క‌న్న‌డ చిత్ర‌సీమ‌లోని స్టార్ యాక్ట‌ర్ల‌లో ఒక‌రైన ధ్రువ స‌ర్జా హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియ‌న్ ఫిల్మ్ ‘పొగ‌రు’. తెలుగులోనూ ఇదే పేరుతో ఈ చిత్రం విడుదల కాబోతోంది. హ్యాట్రిక్ యాక్ష‌న్ ప్రిన్స్‌గా పేరుపొందిన ధ్రువ స‌ర‌స‌న నాయిక పాత్ర‌ను టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోన్న ర‌ష్మికా మంద‌న్న పోషిస్తోంది. యాక్ష‌న్ ఎంటర్‌టైన‌ర్‌గా రూపుదిద్దుకుంటోన్న ‘పొగ‌రు’కు నంద‌కిశోర్ ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. డిస్ట్రిబ్యూట‌ర్‌గా 100కు పైగా చిత్రాల‌ను పంపిణీ చేసి, ‘అధ్య‌క్షా’ వంటి హిట్ మూవీని నిర్మించిన బి.కె. గంగాధ‌ర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


గురువారం ఈ సినిమాలోని మొద‌టి పాట ‘క‌రాబు’ను యూట్యూబ్‌లో విడుద‌ల చేశారు. ఈ పాట విడుద‌ల‌తో తెలుగు వెర్ష‌న్ ప్ర‌మోష‌న్స్‌ను ప్రారంభించారు. పాపుల‌ర్ క‌న్న‌డ మ్యూజిక్ డైరెక్ట‌ర్ చంద‌న్ శెట్టి స‌మ‌కూర్చిన మాస్ బీట్‌కు భీభత్సమైన స్పందన వస్తోంది. విడుదలైన కొన్ని గంటలలోనే ఈ సాంగ్ 3 మిలియన్ ప్లస్ వ్యూస్‌ని రాబట్టుకోవడం విశేషం. దీంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తూ.. 3 మిలియన్ వ్యూస్ పోస్టర్‌ను విడుదల చేశారు. ర‌ష్మిక చూడ‌ముచ్చ‌ట‌గా, అమాయ‌కంగా క‌నిపిస్తోన్న ఈ సాంగ్‌కు ముర‌ళి కొరియోగ్ర‌ఫీ అందించారు. Updated Date - 2020-08-07T03:14:37+05:30 IST