పొగరు ఎగిరే జెండా... ధైర్యం మండుటెండ..

ABN , First Publish Date - 2020-10-23T07:00:33+05:30 IST

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం) చిత్రంలో ఎన్టీఆర్‌ లుక్‌ను, ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ టీజర్‌ను...

పొగరు ఎగిరే జెండా... ధైర్యం మండుటెండ..

జూనియర్‌ ఎన్టీఆర్‌ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌(రౌద్రం రణం రుధిరం) చిత్రంలో ఎన్టీఆర్‌ లుక్‌ను, ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ టీజర్‌ను గురువారం రామ్‌చరణ్‌ విడుదల చేశారు. తెలంగాణ గోండు వీరుడు కొమరం భీమ్‌ 119వ జయంతి సందర్భంగా ఈ టీజర్‌ను విడుదల చేయడం గమనార్హం. 


కొమరం భీమ్‌ పాత్ర గురించి అల్లూరి సీతారామరాజు వెర్షన్‌లో సాగే ఈ టీజర్‌కు రామ్‌చరణ్‌ వాయిస్‌ ఓవర్‌ ఇచ్చారు. ‘వాడు కనపడితే సముద్రాలు తడబడతాయి. నిలబడితే రాజ్యాలు సాగిలపడతాయి. వాడు పొగరు ఎగిరే జెండా. వాడి ధైర్యం చీకట్లను చీల్చే మండుటెండ.. వాడు భూతల్లి చనుబాలు తాగిన మన్యం ముద్దుబిడ్డ. నా తమ్ముడు.. గోండు బెబ్బులి కొమరం భీమ్‌’ అంటూ రామ్‌చరణ్‌ చెప్పిన డైలాగులకు, ఎన్టీఆర్‌ నటనకు అద్భుతమైన స్పందన వస్తోంది. ఈ టీజర్‌లో ఎన్టీఆర్‌ బాడీ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటోంది. అలాగే ఇంతవరకూ ఎన్టీఆర్‌ ఎన్నో పాత్రలు పోషించినా, వాటికి మించేలా భీమ్‌ పాత్ర ఉండేలా దర్శకుడు రాజమౌళి కేర్‌ తీసుకొంటున్నట్లు ఈ టీజర్‌ చూడగానే అర్థమవుతుంది. నేలతల్లిని నమ్ముకొన్న ఓ అడవిపుత్రుడు ఎలా ఉంటాడో చిత్రంలో చూపిస్తున్నారు రాజమౌళి. రామ్‌చరణ్‌ పాత్రను నిప్పుతో, ఎన్టీఆర్‌ పాత్రను నీటితో పోల్చుతూ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దుతున్నారు రాజమౌళి. డీవీవీ దానయ్య ఈ చిత్రానికి నిర్మాత.

Updated Date - 2020-10-23T07:00:33+05:30 IST

Read more