మీ ఓటు హక్కును వినియోగించుకోండి: రెబల్ స్టార్
ABN , First Publish Date - 2020-12-01T01:21:15+05:30 IST
జీహెచ్‌ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. తాజాగా ఆయన ఓటు యొక్క విశిష్టతను

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు డిసెంబర్ 1న జరగనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. తాజాగా ఆయన ఓటు యొక్క విశిష్టతను తెలుపుతూ.. సోషల్ మీడియా వేదికగా ఓ వీడియోని విడుదల చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు వేస్తేనే మంచి నాయకుడు, మంచి పాలన ప్రజలకు అందుతుందని ఆయన తెలిపారు.
ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ''అందరికీ నమస్కారం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇప్పుడు ఓటు హక్కు అంటే తెలియని వారు ఎవరూ లేరు. అందరికీ తెలుసు. ఓటు వేయడం అనేది మహత్తరమైన అవసరం. డిసెంబర్ 1న జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో అందరూ పాల్గొని మీ ఓటు హక్కు వినియోగించుకోండి. కోవిడ్‌కి భయపడకండి.. మాస్క్‌లు ధరించి, దూరం పాటిస్తూ.. అందరూ వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని అందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే.. మనం ఓటు వేస్తేనే.. మనకు ఎవరు కావాలో.. ఎవరు మంచి అభ్యర్థో.. ఓటు వేసిన దానిని బట్టి తెలుస్తుంది. మనకి తెలిసి కూడా ఓటు వేయకుండా నిర్లక్ష్యంగా ఉండడం మంచి పద్ధతి కాదు. అందువల్ల అందరూ పోలింగ్ బూత్‌కు వెళ్లి మీ ఓటు హక్కు వినియోగించుకోండి.." అని తెలిపారు.