సుశాంత్ ఆత్మహత్య వెనుక నిజాలను వెలికితీస్తాం: ముంబై పోలీస్

ABN , First Publish Date - 2020-06-29T03:58:59+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్యపై ఇప్పటికే అనేక పుకార్లు ప్రచారంలో....

సుశాంత్ ఆత్మహత్య వెనుక నిజాలను వెలికితీస్తాం: ముంబై పోలీస్

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజపుట్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఆయన ఆత్మహత్యపై ఇప్పటికే అనేక పుకార్లు ప్రచారంలో ఉన్నాయి. బాలీవుడ్ బడాబాబులే సుశాంత్ మృతికి కారణమని, సుశాంత్ త్వరగా ఏడుగుతుండడంతో తట్టుకోలేక అతడి సినిమాలను లాగేసారని, అది తట్టుకోలేక డిపారేషన్‌కు గురైన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడని కొందరంటున్నారు. ఇంకొండరేమో.. ప్రేమించిన అమ్మాయి కాదనడంతోనే  ఆత్మహత్య చేసుకున్నాడని అభిప్రాయపడుతున్నారు. మరికొందరైతే పెళ్లి చెడిపోవడం వల్లే బలన్మరణానికి పాల్పడి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారూ. అయితే వాటిలో ఏది నిజం, ఏది అబద్ధం అనే విషయం మాత్రం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఈ నేపథ్యంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. కేసుకు సంబంధించిన ప్రతి విషయాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తున్నామని ముంబై డీసీపీ అభిషేక్ త్రిముఖే చెప్పుకొచ్చారు. సుశాంత్ ఆత్మహత్య వెనకున్న నిజాలను ఎలాగైనా వెలికి తీస్తామని, ప్రజలు తమపై నమ్మకముంచాలని ఆయన కోరారు. ఎట్టిపరిస్థితుల్లోనూ నిజాన్ని వెలికితీస్తామని, అయితే కొంత సమయం పడుతుందని డీసీపీ పేర్కొన్నారు.

Updated Date - 2020-06-29T03:58:59+05:30 IST