డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన నటుడాయన

ABN , First Publish Date - 2020-12-15T02:26:56+05:30 IST

తెలుగు చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ కళకు మంచి ప్రాచుర్యం సంపాదించి పెట్టిన వారిలో ప్రముఖులు పి.జె. శర్మ. కేవలం డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాకుండా నటుడిగానూ

డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ట్రెండ్‌ క్రియేట్‌ చేసిన నటుడాయన

తెలుగు చిత్ర పరిశ్రమలో డబ్బింగ్ కళకు మంచి ప్రాచుర్యం సంపాదించి పెట్టిన వారిలో ప్రముఖులు పి.జె. శర్మ. కేవలం డబ్బింగ్ ఆర్టిస్టుగానే కాకుండా నటుడిగానూ పి.జె.శర్మ పలు పాత్రలతో అలరించారు. ప్రెజెంట్ టాలీవుడ్‌లో డబ్బింగ్ ఆర్టిస్టులు అనగానే ముందుగా గుర్తొచ్చేది డైలాగ్ కింగ్ సాయి కుమార్, రవిశంకర్. అయితే.. ఈ అన్నాదమ్ములిద్దరికీ ఆ డబ్బింగ్ వారసత్వం తండ్రి పి.జె.శర్మ నుంచే వచ్చింది. దాదాపు 500 చిత్రాల్లోని పలువురి నటులకు తన గాత్రాన్ని అందించారు శర్మ. తనదైన గాంభీర్యమైన కంఠంతో ఆన్ స్క్రీన్ పై ఆయా పాత్రలకు డాబూ, దర్పాన్ని ఆపాదించారు. వెండితెరపై నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న పి.జె.శర్మ 2014, డిసెంబర్ 14న పరమపదించారు. వర్థంతి సందర్భంగా.. ఆయననొకసారి గుర్తు చేసుకుందామా. 


అప్పట్లో వెండితెరపై జడ్జి అంటే ముందుగా గుర్తొచ్చేది పి.జె.శర్మ. ఇక.. పలు చిత్రాల్లో పోలీస్ ఉన్నతాధికారుల పాత్రల్లోనూ శర్మ ఒదిగిపోయారు. 12 ఏళ్లకే రంగస్థలంపై అడుగిడిన అనుభవం ఉన్న పి.జె.శర్మ.. పలు చిత్రాల్లో ఎన్నో ప్రాధాన్యత గల పాత్రల్లో నటించారు. 'రంగులరాట్నం', 'కలెక్టర్ జానకి', 'భక్తతుకారం', 'శ్రీరామాంజనేయ యుద్ధం', 'దానవీర శూర కర్ణ', 'కురుక్షేత్రం', 'రామ్ రాబర్ట్ రహీమ్', 'న్యాయం కావాలి', 'విజేత', 'కర్తవ్యం', 'తొలిప్రేమ' వంటి చిత్రాలలో శర్మ పోషించిన పాత్రలకు మంచి పేరొచ్చింది. పి.జె.శర్మ తనయులు సాయికుమార్, రవిశంకర్, అయ్యప్ప శర్మ నటులుగా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా దూసుకుపోతున్నారు. మనవడు ఆది సైతం హీరోగా సత్తా చాటుతున్నాడు.

Updated Date - 2020-12-15T02:26:56+05:30 IST