పిశాసు 2 ప్రారంభం

ABN , First Publish Date - 2020-12-18T05:03:58+05:30 IST

దక్షిణాది కథానాయిక అండ్రియా జెర్మయ్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న తమిళ హారర్‌ చిత్రం ‘పిశాసు 2’. 2014లో వచ్చిన ‘పిశాసు’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. సీక్వెల్‌కు కూడా మిస్కిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు....

పిశాసు 2 ప్రారంభం

దక్షిణాది కథానాయిక అండ్రియా జెర్మయ్య ప్రధాన పాత్రలో నటిస్తోన్న తమిళ హారర్‌ చిత్రం ‘పిశాసు 2’. 2014లో వచ్చిన ‘పిశాసు’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఈ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. సీక్వెల్‌కు కూడా మిస్కిన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. నటి పూర్ణ దెయ్యం పాత్రలో నటిస్తున్నారు. రాక్‌ఫోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది. రాజ్‌కుమార్‌ పిచుమణి కీలకపాత్ర పోషిస్తున్నారు. కార్తీక్‌రాజా సంగీతం అందిస్తున్నారు. ఆండ్రియా, విజయ్‌ జంటగా నటించిన ‘మాస్టర్‌’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.  Updated Date - 2020-12-18T05:03:58+05:30 IST