అసక్తికరంగా `పెంగ్విన్` టీజర్!

ABN , First Publish Date - 2020-06-08T18:17:04+05:30 IST

`మహాన‌టి`తో జాతీయ ఉత్తమ నటిగా నిలిచిన కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం `పెంగ్విన్

అసక్తికరంగా `పెంగ్విన్` టీజర్!

`మహాన‌టి`తో జాతీయ ఉత్తమ నటిగా నిలిచిన కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం `పెంగ్విన్`. లాక్‌డౌన్ కారణంగా ఈ సినిమాను నేరుగా ఓటీటీలో విడుదల చేస్తున్నారు. జూన్ 19 నుంచి ఈ సినిమా అమేజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమా టీజర్ తాజాగా బయటకు వచ్చింది. 


ప్రముఖ హీరోయిన్ సమంత ఈ సినిమా టీజర్‌ను ట్విటర్ ద్వారా విడుదల చేసింది. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది. కొడుకును కోల్పోయిన తల్లి పాత్రలో కీర్తి నటించింది. టీజర్ ఆసాంతం ఉత్కంఠగా సాగింది. `పేట` దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. ఈ నెల 11వ తేదీన ఈ సినిమా ట్రైలర్ విడుదల కాబోతోంది. 




Updated Date - 2020-06-08T18:17:04+05:30 IST