ఈ ‘పెళ్లి సందడి’ హీరో.. కత్తిలా ఉన్నాడుగా..
ABN, First Publish Date - 2020-10-27T04:20:37+05:30
1996వ సంవత్సరంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లిసందడి' చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఈ విషయం
1996వ సంవత్సరంలో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన 'పెళ్లిసందడి' చిత్రం సంచలన విజయాన్ని అందుకుంది. ఈ విషయం అందరికీ తెలిసిందే. శ్రీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం అప్పట్లో టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ అయింది. ఇప్పుడా మ్యాజిక్‌ను మళ్లీ రీ క్రియేట్ చేసేందుకు దర్శకేంద్రుడు సిద్ధమవుతున్నారు. 'పెళ్లిసందడి' పేరుతో ఆయన దర్శకత్వం పర్యవేక్షణలో గౌరీ రోనంకి దర్శకత్వంలో ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. తాజాగా ఈ చిత్రంలో నటించే హీరోని పరిచయం చేసింది చిత్రయూనిట్.
ఆ 'పెళ్లిసందడి'లో శ్రీకాంత్ నటిస్తే.. ఈ 'పెళ్లిసందడి'లో ఆయన కుమారుడు రోషన్ హీరోగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో రోషన్ లుక్‌కి సంబంధించిన ఫొటోలతో కూడిన వీడియోని చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ ఫొటోలలో రోషన్‌ని చూసిన వారంతా.. అబ్బాయ్ కత్తిలా తయారయ్యాడుగా అని అనుకుంటోండటం విశేషం. అనుకోవడమే కాదు.. నిజంగానే రోషన్‌లో చాలా ఛేంజ్ కనబడుతుంది. ఇప్పటి వరకు ఆయన చేసిన చిత్రాలలో కంటే చాలా డిఫరెంట్‌గా, ఫిట్‌గా ఉన్నాడు రోషన్. హీరో లుక్ చూస్తేనే.. ఈ సినిమా ఓ రేంజ్‌లో ఉండబోతోందనేలా రోషన్ మేకోవర్ ఉంది. ఇక ఈ చిత్రాన్ని 'బాహుబలి' చిత్రాన్ని నిర్మించిన శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి మాధవి కోవెలమూడి నిర్మించనున్నారు. ఎమ్.ఎమ్. కీరవాణి సంగీతం అందించనున్నారు.