డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న ఎన్టీఆర్ హీరోయిన్

ABN , First Publish Date - 2020-06-15T18:50:44+05:30 IST

టాలీవుడ్‌లో ‘ప్ర‌యాణం’, ‘ఊస‌ర‌వెళ్లి’ చిత్రాల‌తో గుర్తింపు సంపాదించుకున్న న‌టి పాయ‌ల్ ఘోష్‌.

డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్న ఎన్టీఆర్ హీరోయిన్

టాలీవుడ్‌లో ‘ప్ర‌యాణం’, ‘ఊస‌ర‌వెళ్లి’ చిత్రాల‌తో గుర్తింపు సంపాదించుకున్న న‌టి పాయ‌ల్ ఘోష్‌. ప్రస్తుతం ఈమె సినిమాల్లో నటించే మూడేళ్లు అవుతుంది. అయితే తాను గత ఐదేళ్లుగా డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డుతున్నాన‌ని పాయ‌ల్ ఘోష్ చేసిన ట్వీట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. తాను డిప్రెష‌న్‌కు గురైన‌ప్పుడంతా త‌న కుటుంబ స‌భ్యులు, స్నేహితులు అండ‌గా నిల‌బ‌డుతున్నార‌ని ఆమె తెలిపారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం చాలా బాధ‌గా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ఆమె తెలిపారు. Updated Date - 2020-06-15T18:50:44+05:30 IST