మందుగ్లాసుతో ముద్దుగుమ్మ పాయల్

ABN , First Publish Date - 2020-11-13T14:59:30+05:30 IST

హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఓ గుర్తింపు తెచ్చుకున్న పాయిల్‌రాజ్‌పుత్‌ సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా ఈమె త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది.

మందుగ్లాసుతో ముద్దుగుమ్మ పాయల్

హీరోయిన్‌గా టాలీవుడ్‌లో ఓ గుర్తింపు తెచ్చుకున్న పాయిల్‌రాజ్‌పుత్‌ సోష‌ల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. రీసెంట్‌గా ఈమె త‌న ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన ఫొటో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. ఇంత‌కూ పాయ‌ల్ పోస్ట్ చేసిన ఫొటో ఏంటో తెలుసా..?  అనే వివ‌రాల్లోకెళ్తే..  చేతిలో మందు గ్లాసు ప‌ట్టుకుని ఉన్న ఫొటోను త‌న ఇన్‌స్టాలో పాయ‌ల్ షేర్ చేసింది. ఇది మామూలు గ్లాసు కాదు.. మందుగ్లాసు. అదేంటి పాయ‌ల్ మందు కొడుతుందా! అని అనుకునేరు..అది నిజం కాదు. ఎందుకంటే పాయ‌ల్ మందు గ్లాసు ప‌ట్టుకుంది.. ఓ క‌మ‌ర్షియ‌ల్ యాడ్ కోసం. సాధార‌ణంగా హీరోలు మాత్ర‌మే ప్ర‌మోట్ చేసే మందుని ఓ హీరోయిన్ ప్ర‌మోట్ చేయ‌డం కొత్త విష‌య‌మే.


మ‌రి ఈమె బాట‌ను ఇత‌ర హీరోయిన్స్ ఎవ‌రైనా ఫాలో అవుతారేమో చూడాలి. తొలి చిత్రం ‘ఆర్‌.ఎక్స్ 100’తో గ్లామ‌ర్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న పాయ‌ల్ త‌ర్వాత హీరోయిన్‌గా ఆశించిన స్థాయిలో స‌క్సెస్‌ల‌ను అందుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం తెలుగులో ఈమె న‌టించిన చిత్రం ‘అన‌గ‌న‌గా ఓ అతిథి’ సినిమా ఓటీటీలో విడుద‌ల‌వుతుంది. Updated Date - 2020-11-13T14:59:30+05:30 IST