రాష్ట్రపతికి పాయల్ లేఖ!

ABN , First Publish Date - 2020-10-12T20:19:52+05:30 IST

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేస్తూ

రాష్ట్రపతికి పాయల్ లేఖ!

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపణలు చేస్తూ హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్ ఇటీవల ముంబైలోని ఓ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. అయితే తన ఫిర్యాదును పోలీసులు పట్టించుకోవడం లేదని, తన కేసు విషయంలో ఇప్పటి వరకు పురోగతి లేదని తెలుపుతూ భారత రాష్ట్రపతికి పాయల్ తాజాగా ఓ లేఖ రాసింది. తనకు న్యాయం జరిగేలా చూడాలని అభ్యర్థించింది. 


`గతంలో నాపై జరిగిన లైంగిక దాడి గురించి ముంబై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. నాకు సినిమా అవకాశాలు ఇస్తానని చెప్పి తన ఇంటికి పిలిపించుకుని నిందితుడు నన్ను వేధింపులకు గురి చేశాడు. ఈ విషయమై నేను 22-9-2020న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాను. అయితే ఇప్పటివరకు ఈ కేసు విషయంలో పురోగతి లేదు. నిందితుడు ప్రముఖ వ్యక్తి కావడంతో పోలీసులు అతని జోలికి వెళ్లడం లేదు. ఇదే నేరం ఎవరైనా పేద వ్యక్తి చేసి ఉంటే ఈ పోలీసులు అదే రోజు అరెస్ట్ చేసి ఉండేవారు. కానీ, నా కేసులో నిందితుడు ప్రముఖుడు. అందుకే స్వేచ్ఛగా బయట తిరుగుతున్నాడు. బాధితురాలినైన నేను న్యాయం కోసం అందరి తలుపులూ తడుతున్నాను. ఈ కేసులో జోక్యం చేసుకుని నాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాన`ని పాయల్ ఆ లేఖలో పేర్కొంది. ఆ లేఖను తాజాగా తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది.  Updated Date - 2020-10-12T20:19:52+05:30 IST

Read more