ఇర్ఫాన్‌పై పాయల్‌ ఆగ్రహం

ABN , First Publish Date - 2020-10-21T10:39:15+05:30 IST

లైంగిక వేధింపుల నేపథ్యంలో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై పోలీస్‌ కేసు పెట్టిన నటి పాయల్‌ ఘోష్‌ తాజాగా టీమిండియా క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌పై మండిపడ్డారు...

ఇర్ఫాన్‌పై పాయల్‌ ఆగ్రహం

లైంగిక వేధింపుల నేపథ్యంలో బాలీవుడ్‌ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌పై పోలీస్‌ కేసు పెట్టిన నటి పాయల్‌ ఘోష్‌ తాజాగా టీమిండియా క్రికెటర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌పై మండిపడ్డారు. అనురాగ్‌పై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ప్రధాని, రాష్ట్రపతికి కూడా ఆమె ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తన విషయంలో ఇర్ఫాన్‌ పఠాన్‌ స్పందించకపోవడంపై పాయల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్‌ తనకు మంచి మిత్రుడని, అనురాగ్‌ తనతో ఎలా ప్రవర్తించింది తనకి తెలుసని పాయల్‌ తెలిపారు. అనురాగ్‌ తనతో మాట్లాడిన ప్రతి విషయాన్ని ఇర్ఫాన్‌తో షేర్‌ చేసుకున్నానని, ఇంటికి రమ్మని అనురాగ్‌ మెేసజ్‌ చేసినప్పుడు ఇర్ఫాన్‌ తన పక్కనే ఉన్నాడని వెల్లడించారు. ఇప్పుడు ఇంత జరుగుతున్నా ఇర్ఫాన్‌ పెదవి విప్పకపోవడంపై ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు.

Updated Date - 2020-10-21T10:39:15+05:30 IST