పాయల్‌ ఘోష్‌కు పెరుగుతోన్న మద్దతు

ABN , First Publish Date - 2020-09-29T00:54:01+05:30 IST

హీరోయిన్‌ పాయల్‌ ఘోష్‌కు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కంగనా టీమ్‌ నుంచి, బాలీవుడ్‌లోని మరికొందరి సెలబ్రిటీల నుంచి ఆమెకు మద్దతు

పాయల్‌ ఘోష్‌కు పెరుగుతోన్న మద్దతు

హీరోయిన్‌ పాయల్‌ ఘోష్‌కు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే కంగనా టీమ్‌ నుంచి, బాలీవుడ్‌లోని మరికొందరి సెలబ్రిటీల నుంచి ఆమెకు మద్దతు లభించిన విషయం తెలిసిందే. ఇప్పుడామెకు పొలిటికల్‌ మద్దతు కూడా లభిస్తోంది. బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడైన అనురాగ్‌ కశ్యప్‌ తన పట్ల అనుచితంగా ప్రవర్తించాడని చెబుతూ.. ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పాయల్‌ సంచలన విషయాలను బయటపెట్టింది. ఆ తర్వాత ఒక్కసారిగా బాలీవుడ్‌లో వాతావరణం వేడెక్కింది. తనకు ప్రాణహాని ఉందని, ప్రధాని మోడీని సహాయం కూడా ఆమె కోరింది. అయితే.. ఆమెకు ఇప్పుడు పొలిటికల్‌ సపోర్ట్ లభిస్తున్నట్లుగా తెలుస్తోంది. 


తాజాగా ఆమె ట్విట్టర్‌లో చేసిన పోస్ట్ చూస్తే.. ఆమెకు పొలిటికల్‌ మద్దతు లభించినట్లే అర్థమవుతుంది.  రిపబ్లికన్‌ పార్టీకి చెందిన కేంద్రమంతి రామ్‌దాస్ అథవాలే ఆమెకు సపోర్ట్ చేస్తున్నట్లుగా ట్వీట్‌ చేశారు. 'నటి పాయల్ ఘోష్ చేసిన వాదన ప్రకారం, దర్శకుడు అనురాగ్ కశ్యప్‌ను 7 రోజుల్లో అరెస్టు చేయాలని ముంబై పోలీసులను కోరుతున్నాను. లేదంటే రిపబ్లికన్ పార్టీ తరపున ఆందోళనలు జరపుతాం..' అని రామ్‌దాస్ అథవాలే తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు. 'నాకు మద్దతుగా నిలబడినందుకు రామ్‌దాస్ అథవాలే సార్‌కి ధన్యవాదాలు తెలుపుతున్నాను..' అని పాయల్‌ ఘోష్‌ ట్వీట్‌ చేసింది.

Updated Date - 2020-09-29T00:54:01+05:30 IST