కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి పాయల్‌ ఘోష్‌

ABN , First Publish Date - 2020-10-08T00:40:07+05:30 IST

అనురాగ్‌ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనానికి తెర తీసిన నటి పాయల్‌ ఘోష్‌. తన సమస్యను ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం బలంగా చేస్తూ వస్తుంది. అందులో భాగంగా బుధవారం రోజున కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని కలిసింది.

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి పాయల్‌ ఘోష్‌

అనురాగ్‌ కశ్యప్‌పై లైంగిక ఆరోపణలు చేసి సంచలనానికి తెర తీసిన నటి పాయల్‌ ఘోష్‌. తన సమస్యను ప్రభుత్వానికి చేరవేసే ప్రయత్నం బలంగా చేస్తూ వస్తుంది. అందులో భాగంగా బుధవారం రోజున కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిని కలిసింది. ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్‌ ద్వారా తెలియజేసింది. తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆయనకు లేఖను సమర్పించింది.  కేంద్ర మంత్రిని కలిసి మాట్లాడానని, తనకు న్యాయం జరిగేలా చూడాలని పేర్కొన్నానని ఆమె తెలిపారు. మంగళవారం రోజున జాతీయ మహిళా కమీషన్‌ను పాయల్‌ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. మరోవైపు పాయల్‌ లైంగిక ఆరోపణల్లో పేర్కొన్న ముగ్గురు హీరోయిన్స్‌లో ఒకరైన రిచా చద్దా.. పాయల్‌పై పరువు నష్టం కేసు వేసి, క్షమాపణలు చెబితే కేసు విత్‌ డ్రా చేసుకుంటానని చెప్పినప్పటికీ పాయల్‌ ఘోష్‌ సారీ చెప్పడానికి నిరాకరించింది. 
Updated Date - 2020-10-08T00:40:07+05:30 IST