మరో సినిమా ప్రారంభించిన పవన్!

ABN , First Publish Date - 2020-12-21T19:17:40+05:30 IST

రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రసుతం సినిమాలపై దృష్టి సారించారు.

మరో సినిమా ప్రారంభించిన పవన్!

రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం సినిమాలపై దృష్టి సారించారు. వరుస సినిమాలను లైన్లో పెడుతున్నారు. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న `వకీల్ సాబ్` సినిమాలో నటిస్తున్నారు. అలాగే క్రిష్ సినిమా షూటింగ్‌ను త్వరలో ప్రారంభించనున్నారు. తాజాగా మరో సినిమాను కూడా పట్టాలెక్కించారు. మలయాళ `అయ్యప్పనుమ్ కోషియమ్` సినిమా తెలుగు రీమేక్‌ను ప్రారంభించారు. 


ఈ సినిమాలో పవన్‌తోపాటు రానా కూడా నటిస్తున్నాడు. సాగర్.కె.చంద్ర రూపొందించనున్న ఈ చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఈ రోజు (సోమవారం) పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. దేవుడి పటాలపై పవన్ క్లాప్ కొట్టారు. డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. Updated Date - 2020-12-21T19:17:40+05:30 IST