పవన్ స్మార్ట్ లుక్!

ABN , First Publish Date - 2020-11-04T15:36:29+05:30 IST

లాక్‌డౌన్ సమయంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కొత్త లుక్‌లో కనిపించారు

పవన్ స్మార్ట్ లుక్!

లాక్‌డౌన్ సమయంలో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ కొత్త లుక్‌లో కనిపించారు. గుబురు గెడ్డం, ఒత్తైన జుట్టుతో స్వామీజీ తరహాలో కనిపించారు. ఆ లుక్ చూసి అందరూ షాకయ్యారు. అయితే పవన్ తాజాగా కొత్త లుక్‌తో అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చారు. తాజాగా పవన్ ఫోటో ఒకటి బయటికి వచ్చింది. తన స్నేహితుడు, ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో పవన్ దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో పవన్ గెడ్డం లేకుండా స్మార్ట్ లుక్‌తో కనిపించారు.


`వకీల్ సాబ్` సినిమా కోసం పవన్ తన లుక్ మార్చుకున్నారు. కొన్ని రోజులుగా హైదరాబాద్‌లో `వకీల్ సాబ్` షూటింగ్ జరుగుతోంది. అందులో పవన్ కూడా పాల్గొంటున్నారు. అందుకే పవన్ ఈ స్మార్ట్ లుక్‌లోకి మారిపోయారు. ఇకపై వరుస సినిమాలతో పవన్ బిజీ కాబోతున్నారు. Updated Date - 2020-11-04T15:36:29+05:30 IST

Read more