పవన్‌ కొత్త సినిమా షురూ!

ABN , First Publish Date - 2020-12-22T06:24:38+05:30 IST

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం సోమవారం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది....

పవన్‌ కొత్త సినిమా షురూ!

పవన్‌ కల్యాణ్‌ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ నిర్మిస్తున్న తాజా చిత్రం సోమవారం సంస్థ కార్యాలయంలో ప్రారంభమైంది. మలయాళ హిట్‌ చిత్రం ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేకిది. ఇందులో మరో కీలక పాత్రకోసం చాలామంది కథానాయకుల పేర్లు పరిశీలించినప్పటికీ ఆ అవకాశం రానా దగ్గుబాటిని వరించింది. సాగర్‌.కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సూర్యదేవర నాగవంశీ నిర్మాత. పి.డి.వి. ప్రసాద్‌ సమర్పకులు. పూజా కార్యక్రమాల అనంతరం దేవుని పటాలపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి పవన్‌ కళ్యాణ్‌ క్లాప్‌ ఇచ్చారు. త్రివిక్రమ్‌ కెమెరా స్విచాన్‌ చేశారు. ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు) దర్శకుడికి స్ర్కిప్ట్‌ అందించారు. జనవరిలో చిత్రీకరణ ప్రారంభిస్తారు. సినిమాకు సంబంధించిన ఇతర వివరాలను త్వరలో వెల్లడిస్తామని నిర్మాత చెప్పారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ప్రసాద్‌ మూరెళ్ళ, ఎడిటర్‌: నవీన్‌ నూలి, కళా దర్శకుడు:  ఏ.ఎస్‌.ప్రకాశ్‌.

Updated Date - 2020-12-22T06:24:38+05:30 IST