'వకీల్‌ సాబ్‌' చిత్రీకరణ పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2020-12-30T02:08:46+05:30 IST

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'వకీల్‌ సాబ్‌'. ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పవన్‌కల్యాణ్‌ పూర్తి చేసేశారు.

'వకీల్‌ సాబ్‌' చిత్రీకరణ పూర్తి చేసుకున్న పవన్ కల్యాణ్

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ టైటిల్‌ పాత్రలో నటిస్తోన్న చిత్రం 'వకీల్‌ సాబ్‌'.  ఈ సినిమాలో తన పాత్రకు సంబంధించిన చిత్రీకరణను పవన్‌కల్యాణ్‌ పూర్తి చేసేశారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్‌ అధికారికంగా ప్రకటించింది. చిత్రయూనిట్‌తో కలిసి పవన్‌కల్యాణ్ దిగిన ఫొటోలను కూడా చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. బాలీవుడ్‌ మూవీ 'పింక్‌'కు రీమేక్‌గా రూపొందుతోన్న 'వకీల్‌ సాబ్‌'లో పవన్‌ లాయర్‌ పాత్రలో కనిపిస్తారు. శ్రుతి హాసన్‌ హీరోయిన్‌గా నటించగా, అంజలి, నివేదా థామస్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. దిల్‌రాజు, బోనీ కపూర్‌ నిర్మాతలుగా వేణు శ్రీరామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ఏడాది మే నెలలోనే విడుల కావాల్సిన ఈ సినిమా.. కోవిడ్‌ ప్రభావంతో ఆలస్యమైంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొత్త సంత్సరం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసే అవకాశాలున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. Updated Date - 2020-12-30T02:08:46+05:30 IST

Read more