థాంక్యూ ఫ్రెండ్.. నీతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించా: పవన్
ABN , First Publish Date - 2020-04-25T21:02:30+05:30 IST
పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, సంగీత దర్శకుడు రమణ గోగుల కాంబినేషన్‌లో చాలా సినిమాలు తెరకెక్కాయి.

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, సంగీత దర్శకుడు రమణ గోగుల కాంబినేషన్‌లో చాలా సినిమాలు తెరకెక్కాయి. రమణ గోగుల వాయిస్ పవన్‌కు సరిగ్గా సరిపోయిందని అప్పట్లో కామెంట్లు వినిపించేవి. పవన్ దర్శకత్వం వహించిన `జాని` సినిమాకు కూడా రమణ గోగులే సంగీతం అందించారు. `జాని` విడుదలై 17 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రమణ గోగుల ట్విటర్ ద్వారా ఆ సినిమాను గుర్తు చేసుకున్నారు.
`డియర్ పవన్‌కల్యాణ్, `జాని` సినిమా కోసం నిన్ననే మనం కలిసి పనిచేసినట్టు అనిపిస్తోంది. అప్పుడే 17 సంవత్సరాలు పూర్తయ్యాయంటే నమ్మలేకపోతున్నా. అద్భుతమైన ప్రయాణం. ఆరోగ్యంగా ఉండు మై ఫ్రెండ్` అని రమణ గోగుల ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు పవన్ స్పందిస్తూ.. `థాంక్యూ రమణ గోగుల.. నీతో కలిసి పనిచేయడాన్ని ఆస్వాదించా. చాలా సరదాగా, సృజనాత్మకంగా గడిచిన అద్భుత క్షణాలు అవి. ఆల్ ది బెస్ట్ మై ఫ్రెండ్` అని ట్వీట్ చేశారు.