పరుచూరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: పవన్ కల్యాణ్

ABN , First Publish Date - 2020-08-08T01:18:03+05:30 IST

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు స‌తీమ‌ణి పరుచూరి విజయలక్ష్మి శుక్ర‌వారం తెల్ల‌వారుజామున గుండెపోటుతో మృతి చెందిన విషయం

పరుచూరి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి: పవన్ కల్యాణ్

ప్రముఖ రచయిత పరుచూరి వెంకటేశ్వరరావు స‌తీమ‌ణి పరుచూరి విజయలక్ష్మి శుక్ర‌వారం తెల్ల‌వారుజామున గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. విజయలక్ష్మి మరణవార్త తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి పరుచూరి వెంకటేశ్వరరావుకు ఫోన్ చేసి పరామర్శించారు. తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పరుచూరి వెంకటేశ్వరరావు తనకు ఎంతో ఆత్మీయుడని, ఆ కుటుంబంతో తనకు మంచి అనుబంధం ఉందని ఆయన పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా పరుచూరి కుటుంబానికి తన ప్రగాఢ సానూభూతి తెలియజేస్తూ.. ఓ ప్రెస్‌నోట్‌ను విడుదల చేశారు.


పరుచూరి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి

‘‘ప్రముఖ రచయిత శ్రీ పరుచూరి వెంకటేశ్వరరావు గారి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి‌గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి విజయలక్ష్మి‌గారు ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. పరుచూరి సోదరుల కుటుంబాలతో మా కుటుంబానికి మంచి స్నేహం ఉంది. ఈ కష్ట సమయంలో శ్రీ వెంకటేశ్వర‌రావుగారికి, వారి కుటుంబానికి భగవంతుడు మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను..’’ అని పవన్ కల్యాణ్ ప్రెస్‌నోట్‌లో తెలిపారు.Updated Date - 2020-08-08T01:18:03+05:30 IST

Read more