రామ్ తాళ్లూరిపై ప్రశంసల వర్షం కురిపించిన పవన్‌కల్యాణ్

ABN , First Publish Date - 2020-04-07T00:07:04+05:30 IST

ప్రముఖ రచయిత క్యాథ్‌లీన్ ట్రేసీ రచించిన ‘డైనమిక్ ఫౌండర్స్ ఆఫ్ ది 21స్ట్ సెంచరీ’ అనే పుస్తకంలో పారిశ్రామికవేత్త, టాలీవుడ్ నిర్మాత రామ్ తాళ్లూరికి

రామ్ తాళ్లూరిపై ప్రశంసల వర్షం కురిపించిన పవన్‌కల్యాణ్

హైదరాబాద్: ప్రముఖ రచయిత క్యాథ్‌లీన్ ట్రేసీ రచించిన ‘డైనమిక్ ఫౌండర్స్ ఆఫ్ ది 21స్ట్ సెంచరీ’ అనే పుస్తకంలో పారిశ్రామికవేత్త, టాలీవుడ్ నిర్మాత రామ్ తాళ్లూరికి చోటు దక్కింది. ‘లీడ్ఐటీ’అనే సంస్థ వ్యవస్థాపకుడు అని రామ్.. టాలీవుడ్‌లో పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. రవితేజ నటించి ‘నేల టికెట్’, ‘డిస్కో రాజా’ సినిమాలకు నిర్మాత అయినే. జనసేన అధినేత, పవర్‌స్టార్ పవన్‌కల్యాన్‌కి ఆయన మంచి మిత్రుడు. అయితే రామ్ తాళ్లూరికి ఆ ప్రతిష్టాత్మకమైన పుస్తకంలో చోటు దక్కడంపై పవన్ హర్షం వ్యక్తం చేశారు. 


ట్విట్టర్ వేదికగా ‘‘క్యాథ్‌లీన్ ట్రేసీ రాసిన ‘డైనమిక్ ఫౌండర్స్ ఆఫ్ ది 21స్ట్ సెంచరీ’ అనే పుస్తకంలో చోటు దక్కించుకున్న రామ్ తాళ్లూరిని మనస్పూర్తిగా అభినందిస్తున్నాను. ఆ పుస్తకంలో చోటు దక్కిన 15 మంది వ్యవస్థాపకుల్లో అతను ఒకరు. 650 మందికి పైగా పని చేస్తున్న అతని కంపెనీ ‘లీడ్ ఐటీ’.. ఎన్నో స్టార్ట్‌ఆప్‌లు, ఫార్ట్యూన్ కంపెలకు ప్రోత్సాహాన్ని అందించింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన రామ్ తాళ్లూరి.. ప్రభుత్వ ఉద్యోగిగా.. తన ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన అతి పెద్ద ట్రామ్‌పొలైన్ పార్క్ స్కై జోన్‌ ఫ్రాంచైజీకి యజమాని. ఆయన కృషి, పట్టుదలే ఇవ్వని సాధ్యమయ్యేలా చేశాయి’’ అని పవన్ పేర్కొన్నారు. 


‘‘వ్యాపార విలువతో పాటు.. ఆయనకు సామాజిక సేవ, సమాజం మీద ప్రేమ తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశం బాగు కోసం కృషి చేసేలా చేసింది’’ అంటూ పవన్ ట్వీట్ చేశారు. 

Updated Date - 2020-04-07T00:07:04+05:30 IST