మరో సినిమాను అనౌన్స్ చేసిన పవన్‌కల్యాణ్
ABN , First Publish Date - 2020-10-25T16:49:12+05:30 IST
ఇప్పుడు పవన్ కల్యాణ్ మరో సినిమాను అధికారికంగా ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు.

పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ చేయబోయే మరో సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఇప్పటికే 'వకీల్ సాబ్' సినిమా సెట్స్‌పై ఉండగా, క్రిష్ దర్శకత్వంలో ఓ సిసినిమా, హరీశ్ శంకర్ దర్శకత్వంలో, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో సినిమాలు చేయబోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పవన్ కల్యాణ్ మరో సినిమాను అధికారికంగా ప్రకటించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాగర్ కె.చంద్ర దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. పవన్‌కల్యాణ్ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని 'కింగ్ ఆఫ్ ఆట్యిట్యూడ్. .. తెలుగు సినిమా ఫేవరేట్ పోలీస్ ఆఫీసర్ మరోసారి హై ఓల్టేజ్ రోల్‌తో మరోసారి రాబోతున్నారు' అంటూ సినిమాను అనౌన్స్ చేశారు. 'అయ్యారే, అప్పట్లో ఒకడుండేవాడు' చిత్రాలను తెరకెక్కించిన సాగర్ కె.చంద్ర తెరకెక్కించబోయే చిత్రమిదే. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తుండగా, ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మలయాళ చిత్రం 'అయ్యప్పనుమ్ కోశియుమ్'కు ఇది రీమేక్‌గా రూపొందనుందని టాక్.
Read more