ఈ ఫొటోలో పవన్‌ ఇంట్రస్ట్‌గా చూస్తున్నదేమిటో తెలుసా?

ABN , First Publish Date - 2020-11-06T04:52:47+05:30 IST

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ 'వకీల్‌సాబ్‌' షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. ఆయన గురువారం హైదరాబాద్ మెట్రో రైలులో షూటింగ్‌ లోకేషన్‌కి

ఈ ఫొటోలో పవన్‌ ఇంట్రస్ట్‌గా చూస్తున్నదేమిటో తెలుసా?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ చాలా గ్యాప్‌ తర్వాత మళ్లీ 'వకీల్‌సాబ్‌' షూటింగ్‌లో జాయిన్‌ అయ్యారు. ఆయన గురువారం హైదరాబాద్ మెట్రో రైలులో షూటింగ్‌ లోకేషన్‌కి వెళ్లిన వీడియో, ఫొటోలు నెట్‌లో వైరల్‌ అవుతోన్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం మాదాపూర్ నుంచి మియాపూర్ వరకు ఆయన మెట్రో రైలులో ప్రయాణం చేశారు. తోటి ప్రయాణికులతో సంభాషించడం, సెల్ఫీలు ఇవ్వడం, రైతులతో మాట్లాడటం వంటి ఫొటోలు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ ఫొటోలలో ఒక ఫొటో మాత్రం అందరినీ ఆకర్షిస్తోంది. ఆ ఫొటో ఇదే. ఈ ఫొటోలో పవన్‌ ఇంట్రెస్ట్‌గా చూస్తున్నది ఏమిటని అనుకుంటున్నారు కదా..!. తన అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవి స్థాపించిన చిరంజీవీ చారిటబుల్‌ ట్రస్ట్. మెట్రో రైలులో వెళుతూ.. పవన్‌ ప్రత్యేకంగా దీనిని ఆసక్తికరంగా చూస్తుండటంతో.. ఈ ఫొటో నెటిజన్లని బాగా ఆకర్షిస్తోంది. 

Updated Date - 2020-11-06T04:52:47+05:30 IST