మహేష్‌ ఫ్యామిలీకి పవన్‌ ఫ్యామిలీ క్రిస్మస్‌ గిఫ్ట్

ABN , First Publish Date - 2020-12-24T04:03:17+05:30 IST

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు ఫ్యామిలీకి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఫ్యామిలీ నుంచి క్రిస్మస్‌ గిఫ్ట్ వచ్చినట్లుగా సూపర్‌ స్టార్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ ఇన్‌స్టాగ్రమ్‌ స్టేటస్‌లో

మహేష్‌ ఫ్యామిలీకి పవన్‌ ఫ్యామిలీ క్రిస్మస్‌ గిఫ్ట్

సూపర్‌ స్టార్ మహేష్‌ బాబు ఫ్యామిలీకి పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ఫ్యామిలీ నుంచి క్రిస్మస్‌ గిఫ్ట్ వచ్చినట్లుగా సూపర్‌ స్టార్‌ భార్య నమ్రతా శిరోద్కర్‌ ఇన్‌స్టాగ్రమ్‌ స్టేటస్‌లో పోస్ట్ చేశారు. అంతకుముందు దీపావళికి మహేష్‌ బాబు.. అందరికీ గిఫ్ట్స్‌ పంపించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు నుంచి దివాళి గిఫ్ట్ అందుకున్నవారంతా సోషల్‌ మీడియా వేదికగా.. ఆయనకు, ఫ్యామిలీకి ధన్యవాదాలు తెలిపారు. తాజాగా క్రిస్మస్‌ను పురస్కరించుకుని పవన్‌ కల్యాణ్‌, ఆయన భార్య అన్నా లెజ్నోవా అద్భుతమైన గిఫ్ట్ పంపినట్లుగా నమ్రత తెలుపుతూ.. వారికి ధన్యవాదాలు తెలిపింది. దీంతో మరోసారి ఇరు స్టార్స్‌ అభిమానులు సోషల్‌ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తూ.. ఈ విషయాన్ని ట్రెండ్‌ చేస్తున్నారు. పవన్‌ కల్యాణ్‌ తనకున్న మామిడి తోటలో పండిన పండ్లను సెలబ్రిటీలకు పంపిస్తాడనే విషయం కూడా అందరికీ తెలిసిందే.

Updated Date - 2020-12-24T04:03:17+05:30 IST