మరోసారి రిపీట్ కాబోతున్న పవన్-హరీశ్ శంకర్ కాంబో

ABN , First Publish Date - 2020-02-02T01:14:16+05:30 IST

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అనంతరం చకాచకా స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ వాటిని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే

మరోసారి రిపీట్ కాబోతున్న పవన్-హరీశ్ శంకర్ కాంబో

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన అనంతరం చకాచకా స్క్రిప్ట్‌లను ఎంచుకుంటూ వాటిని పట్టాలెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పవన్ హీరోగా ‘పింక్’ అనే చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసింది. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో మరో సినిమాను కూడా పట్టాలెక్కించేశారు. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ మరో చిత్రానికి సైన్ చేశారు. ఈ విషయాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించింది.

 

ఇప్పటికే పవన్ - హరీష్ శంకర్ కాంబినేషన్‌లో ‘గబ్బర్‌సింగ్’ సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబో రిపీట్ అవుతుండటంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవి శంకర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ చిత్రం త్వరలో ప్రారంభం కాబోతోంది. ఈ మూవీకి సంబంధించిన పూర్తి విషయాలు త్వరలో వెల్లడిస్తామని చిత్రబృందం తెలిపింది.

Updated Date - 2020-02-02T01:14:16+05:30 IST