సీఎం సహాయనిధికి పవన్‌కల్యాణ్ రూ.కోటి విరాళం

ABN , First Publish Date - 2020-10-21T13:19:35+05:30 IST

హీరో, రాజ‌కీయ నాయ‌కుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోటి రూపాయ‌ల‌ను విరాళంగా ప్ర‌క‌టించారు.

సీఎం సహాయనిధికి పవన్‌కల్యాణ్ రూ.కోటి విరాళం

భారీ వర్షాల కారణంగా తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. ప్రాణ‌, ఆస్థిన‌ష్టం సంభ‌వించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా తామూ ఉన్నామంటూ టాలీవుడ్‌ సినీ పరిశ్రమ ముందుకొచ్చింది. ఇప్పటికే ఎంతో మంది సినీ ప్రముఖులు తమ వంతు సహాయాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు అందించారు. తాజాగా హీరో, రాజ‌కీయ నాయ‌కుడు, జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ కోటి రూపాయ‌ల‌ను విరాళంగా ప్ర‌క‌టించారు. 

Updated Date - 2020-10-21T13:19:35+05:30 IST