‘పరుగు’ నాయికకు పెళ్లైంది
ABN , First Publish Date - 2020-03-15T05:32:36+05:30 IST
అల్లు అర్జున్ ‘పరుగు’లో కథానాయికగా నటించిన షీలా కౌర్ గుర్తున్నారా? అంతకు ముందు ‘సీతా కల్యాణం’ చిత్రంలో నటించినప్పటీ... ‘పరుగు’ ఆమెకు గుర్తింపు తెచ్చింది.

అల్లు అర్జున్ ‘పరుగు’లో కథానాయికగా నటించిన షీలా కౌర్ గుర్తున్నారా? అంతకు ముందు ‘సీతా కల్యాణం’ చిత్రంలో నటించినప్పటీ... ‘పరుగు’ ఆమెకు గుర్తింపు తెచ్చింది. ఇటీవల చెన్నైకి చెందిన వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని షీలా వివాహం చేసుకున్నారు. ఈ విషయం చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం షీలా పెళ్లి ఫొటో ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతోంది. ‘పరుగు’ తర్వాత రామ్ పోతినేని ‘మస్కా’, చిన్న ఎన్టీఆర్ ‘అదుర్స్’, నందమూరి బాలకృష్ణ ‘పరమ వీరచక్ర’తో పాటు పలు తమిళ, మలయాళ చిత్రాల్లో నటించారు. తొమ్మిదేళ్లుగా చిత్రాలకు దూరంగా ఉన్నారు. ‘పరమ వీరచక్ర’ తర్వాత 2018లో కన్నడ చిత్రం ‘హైపర్’ చేశారంతే! ఆ తర్వాత మళ్లీ నటించలేదు.