‘వకీల్ సాబ్’ సూపర్ టైటిల్: పరుచూరి గోపాలకృష్ణ

ABN , First Publish Date - 2020-05-26T22:36:47+05:30 IST

రచయిత పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’ అంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ ద్వారా.. సినిమాలపై తనకున్న అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్న విషయం

‘వకీల్ సాబ్’ సూపర్ టైటిల్: పరుచూరి గోపాలకృష్ణ

రచయిత పరుచూరి గోపాలకృష్ణ ‘పరుచూరి పలుకులు’ అంటూ ఓ యూట్యూబ్ ఛానెల్ ద్వారా.. సినిమాలపై తనకున్న అభిప్రాయాలను ఎప్పటికప్పుడు పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఏ సినిమా అయినా దానికున్న ప్లస్‌లు, మైనస్‌లను ఆయన ఈ ఛానెల్‌లో తన కోణంలో వివరిస్తుంటారు. తాజాగా ఆయన ‘వకీల్ సాబ్’ టైటిల్ గురించి ‘పరుచూరి పలుకులు’లో టాపిక్ లేవనెత్తారు. ‘పింక్’ రీమేక్ తెలుగులో చేస్తున్నారని తెలిసినప్పటి నుంచి.. ఈ సినిమాకు ఏం టైటిల్ పెడతారో అనే ఎంతో ఆసక్తిగా ఎదురు చూశానని తెలిపిన ఆయన, ‘వకీల్ సాబ్’ అని ప్రకటించిన తర్వాత.. వావ్ సూపర్ టైటిల్ పెట్టారని ఆనందించినట్లుగా తెలిపారు.


అలాగే తన పేరు మీద సినిమా టైటిల్ ఉండాలని కోరుకోని హీరోలలో పవన్ కల్యాణ్ ఒకరని, అందుకు ఉదాహరణ ‘జల్సా, అత్తారింటికి దారేది’ టైటిల్సే అని అన్నారు. ‘పింక్’ తెలుగు రీమేక్‌కు ‘వకీల్ సాబ్’ అనేది చాలా చక్కని టైటిల్ అని పరుచూరి అన్నారు. ఎందుకంటే అని తెలుపుతూ.. ‘‘వకీల్ సాబ్ అని పెట్టకుండా పాతరోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి వారు చేసిన ‘లాయర్ విశ్వనాధ్, లాయర్ భారతీదేవి’.. ఇలా పెట్టవచ్చు. ఎందుకంటే మేం అలా పెట్టాం కూడా. అలా ఈ సినిమాకి కూడా ఏదైనా టైటిల్ పెడతారని అనుకున్నా. ఏదైనా మంచి పేరు పవన్‌కు పెట్టి.. దానికి ముందు లాయర్ అని పెడతారని అనుకున్నా. కానీ వకీల్ సాబ్ అనే టైటిల్ ఎవరికి తట్టిందో వారికి మాత్రం నమస్కారం పెడుతున్నాను..’’ అని పరుచూరి గోపాలకృష్ణ తెలిపారు. ఇంకా ఈ టైటిల్ గురించి ఆయన చాలా చెప్పారు. అదేంటో తెలియాలంటే.. కింది వీడియో చూడాల్సిందే. Updated Date - 2020-05-26T22:36:47+05:30 IST