పార్టీ ఫ్రీక్‌...న్యూ ఇయర్‌ స్పెషల్‌!

ABN , First Publish Date - 2020-12-30T06:02:07+05:30 IST

కరాబు... ఈ ఏడాది యూట్యూబ్‌లో చక్కటి వీక్షకాదరణ దక్కించుకున్న పాటల్లో ఇదొకటి. ధృవ్‌ సర్జా, రష్మిక జంటగా నటిస్తున్న ‘పొగరు’లోనిదీ పాట...

పార్టీ ఫ్రీక్‌...న్యూ ఇయర్‌ స్పెషల్‌!

కరాబు... ఈ ఏడాది యూట్యూబ్‌లో చక్కటి వీక్షకాదరణ దక్కించుకున్న పాటల్లో ఇదొకటి. ధృవ్‌ సర్జా, రష్మిక జంటగా నటిస్తున్న ‘పొగరు’లోనిదీ పాట. కన్నడ సంగీత దర్శకుడు చందన్‌శెట్టి దీనిని స్వరపరిచారు. కన్నడలో 183+, తెలుగులో 49+ మిలియన్‌ వ్యూస్‌ పొందింది. సూపర్‌హిట్‌ ‘కరాబు...’ తర్వాత కొత్త పాటతో చందన్‌ శెట్టి శ్రోతల ముందుకొచ్చారు. ‘పార్టీ ఫ్రీక్‌...’ అంటూ న్యూ ఇయర్‌ సెలబ్రేషన్స్‌ కోసం స్పెషల్‌ సాంగ్‌ కంపోజ్‌ చేశారు. కన్నడలో రెండు రోజుల్లో రెండు మిలియన్స్‌ వ్యూస్‌ పొంది చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. తాజాగా ఈ పాటను తెలుగులోనూ విడుదల చేశారు. ‘‘పార్టీ ఫ్రీక్‌ తెలుగులోనూ విడుదల కావడం సంతోషంగా ఉంది. ‘కరాబు...’ తెలుగు ప్రేక్షకులకు ఎంతలా నచ్చిందో ఈ పాట కూడా అంతే నచ్చుతుందని చెప్పగలను’’ అని చందన్‌ శెట్టి అన్నారు. ఈ గీతానికి ఆయనే సాహిత్యం అందించడంతో పాటు పాడటం విశేషం. యునైటెడ్‌ ఆడియో ఈ పాటను ప్రొడ్యూస్‌ చేసింది.

Updated Date - 2020-12-30T06:02:07+05:30 IST