‘పరిగెత్తు పరిగెత్తు’ చిత్ర ఫస్ట్ లుక్ వదిలారు

ABN , First Publish Date - 2020-09-29T03:24:33+05:30 IST

ఎన్. ఎస్. సినీ ఫ్లిక్స్ బ్యానర్‌పై సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య హీరోహీరోయిన్లుగా రామకృష్ణ తోట దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్‌ క్రైమ్

‘పరిగెత్తు పరిగెత్తు’ చిత్ర ఫస్ట్ లుక్ వదిలారు

ఎన్. ఎస్. సినీ ఫ్లిక్స్  బ్యానర్‌పై సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య హీరోహీరోయిన్లుగా రామకృష్ణ తోట దర్శకత్వంలో రూపొందుతున్న సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ చిత్రం 'పరిగెత్తు పరిగెత్తు'. యామినీ కృష్ణ అక్కరాజు నిర్మిస్తున్న ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. తాజాగా చిత్ర యూనిట్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. 


ఫస్ట్ లుక్ విడుదల సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. ''సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రం రూపొందింది. తెలుగు ప్రేక్షకులు కంటెంట్‌ బేస్డ్‌ మూవీస్‌ని ఎప్పుడూ ఆదరిస్తుంటారు. 'పరిగెత్తు పరిగెత్తు" చిత్రం కూడా ఆ కోవలోనే ఉంటుంది. సూర్య శ్రీనివాస్‌, అమృత ఆచార్య చాలా బాగా నటించారు. అలాగే మిగతా ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్‌ సినిమా బాగా రావడానికి ఎంతగానో సహకరించారు. అలాగే ఎన్నో సూపర్‌హిట్‌ చిత్రాలకు సంగీతాన్ని అందించిన సునీల్‌ కశ్యప్‌ మా సినిమాకి సంగీతం అందించడం సంతోషంగా ఉంది. కల్యాణ్‌ సమి బ్యూటిఫుల్‌ విజువల్స్‌, వెంకట ప్రభు ఎడిటింగ్‌, రాజ్‌కుమార్‌ ఆర్ట్‌ వర్క్‌, శంకర్‌ స్టంట్స్‌ సినిమాకి ప్లస్‌ అవుతాయి. ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్‌ అంశాలు ఇందులో ఉన్నాయి. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్‌ వివరాలను తెలియజేస్తాము.. " అని అన్నారు.

Updated Date - 2020-09-29T03:24:33+05:30 IST