40 యేళ్ళ నా కెరియర్‌లో ఇదే బెస్ట్ సినిమా: తమ్మారెడ్డి

ABN , First Publish Date - 2020-03-04T02:33:35+05:30 IST

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌

40 యేళ్ళ నా కెరియర్‌లో ఇదే బెస్ట్ సినిమా: తమ్మారెడ్డి

రక్షిత్, నక్షత్ర జంటగా కరుణకుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. తమ్మారెడ్డి భరద్వాజ సమర్పణలో ధ్యాన్‌ అట్లూరి నిర్మించిన ఈ చిత్రం సురేష్‌ ప్రొడక్షన్స్‌ ద్వారా మార్చి 6న విడుదల కానుంది. విడుదలకు ముందే ఇండస్ట్రీలో కొత్తతరహా సినిమాగా ప్రశంసలు అందుకున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. యువ హీరోలు నాగశౌర్య, శ్రీ విష్ణు, దర్శకుడు మారుతి ప్రత్యేక అతిథులుగా హాజరై టీమ్‌ని అభినందించారు.


ఈ సందర్భంగా రాజ్ కందుకూరి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ భాష తీసుకోని పెళ్ళి చూపులు తీసినట్లు.. వీళ్ళు ఉత్తరాంధ్రలోని పలాస ప్రాంతాన్ని తీసుకోని ‘పలాస1978’ తీసారనిపించింది. ఈ సినిమా చూసిన వారందరికీ ఆ పాత్రలు గుర్తుండిపోతాయి. ఈ సినిమా నిర్మించిన ప్రసాద్‌గారికి, హీరో రక్షిత్, హీరోయిన్ నక్షత్ర, రఘుకుంచె ఇలా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్’’ అన్నారు.


తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ.. ‘‘దర్శకుడు కరుణ్ చెప్పినప్పుడు బాగుంది కానీ ఎవరు చేస్తారు అనుకున్నాను. నిర్మాత ప్రసాద్‌గారికి పంపాను. రక్షిత్ ఈ క్యారెక్టర్‌కి బాగుంటాడు అనుకున్నాను. నన్ను సమర్పకుడిగా చేసినప్పుడు కొంచెం కంగారుపడ్డాను. 40 యేళ్ళ నా కెరియర్ లో ఇదే బెస్ట్ సినిమా అని నమ్మకంగా చెప్పగలను. ఈ సినిమా పోస్టర్‌పై నా పేరు ఉన్నందుకు గర్వపడుతున్నాను. ఇందులో చేసిన ప్రతి ఒక్కరూ ప్రాణం పెట్టి చేశారు. డిఫరెంట్ కథలను ప్రేక్షకులు ఇష్టపడుతున్నారు. ఈ సినిమాను కూడా ఆశీర్వదిస్తారు అని నమ్ముతున్నాను’’ అన్నారు.


మధుర శ్రీధర్ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమా టీజర్, ట్రైలర్ నన్ను బాగా ఆకట్టుకున్నాయి. ట్రైలర్ బాగా నచ్చింది. మార్చి 6 కోసం ఎదురుచూస్తున్నాను. రఘుకుంచె‌కు జానపదాల మీద ఉన్న ప్రేమ తెలుసు. అదే ఈ సినిమాలో కూడా కనిపించింది టీం అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతున్నాను’’ అన్నారు.


హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. ‘‘పలాస గురించి తెలుసుకున్నప్పుడు ఈ సినిమా నా సినిమా అనే ఫీల్ కలుగుతుంది. అలాగే మనస్ఫూర్తిగా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నాను. దర్శకుడు తనదైన మార్క్‌ని తెలుగు సినిమాపై ఇవ్వబోతున్నారు అనిపిస్తుంది. రఘుగారు ఇచ్చిన ‘పలాస మీద వచ్చిన పాట’ చాలా బాగుంది. ఇది ప్రేక్షకుల్లో బలమైన ముద్రను వేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

Updated Date - 2020-03-04T02:33:35+05:30 IST

Read more