పానీ పూరీ అని అరుస్తున్న భర్తని శ్రియ ఏం చేసిందంటే..

ABN , First Publish Date - 2020-05-11T04:21:09+05:30 IST

హీరోయిన్ శ్రియ, ఆమె భర్త ఆండ్రీ ఇన్‌స్టాగ్రమ్‌లో మాములుగా అల్లరి చేయడం లేదు. వారు ఇంటిలో చేసే పనులను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి నెటిజన్లకు కూడా ఫుల్

పానీ పూరీ అని అరుస్తున్న భర్తని శ్రియ ఏం చేసిందంటే..

హీరోయిన్ శ్రియ, ఆమె భర్త ఆండ్రీ ఇన్‌స్టాగ్రమ్‌లో మాములుగా అల్లరి చేయడం లేదు. వారు ఇంటిలో చేసే పనులను ఇన్‌స్టాలో పోస్ట్ చేసి నెటిజన్లకు కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తున్నారు. స్పెయిన్‌‌లో ఉన్న వీరిద్దరూ లాక్‌డౌన్ కారణంగా బయటికి రాలేని పరిస్థితులను అనుభవిస్తున్నారు. అందుకే ఇంటిలోనే ఉంటూ.. హ్యాపీగా స్పెండ్ చేస్తున్నారు. తాజాగా వీరిద్దరి మధ్య నడిచిన పానీ పూరీ వార్‌ను శ్రియ ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసింది.


శ్రియ భర్త ఆండ్రీ పానీ పూరీ పానీ పూరీ పానీ పూరీ అంటూ రోడ్డు మీద అమ్మేవాడిలా అరుస్తుంటే.. దీనికి శ్రియ రియాక్షన్ మాములుగా ఇవ్వలేదు. షటప్ అంటూ అతని నోట్లో పానీ పూరీ పెట్టేసింది. పానీ పూరీ పెట్టిన తర్వాత శ్రియ నవ్వుంది చూశారూ.. అబ్బో అది చెప్పే కంటే కింది వీడియో చూస్తేనే బెటర్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.Updated Date - 2020-05-11T04:21:09+05:30 IST