దర్శకుడితో ఆర్య బాక్సింగ్‌

ABN , First Publish Date - 2020-11-04T22:23:55+05:30 IST

పా.రంజిత్‌ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సల్పేటా’. ఈ చిత్రంలో ప్రముఖ హీరో ఆర్య బాక్సర్‌గా నటిస్తున్నారు.

దర్శకుడితో ఆర్య బాక్సింగ్‌

పా.రంజిత్‌ తాజాగా దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సల్పేటా’. ఈ చిత్రంలో ప్రముఖ హీరో ఆర్య బాక్సర్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో నటించేందుకు ఆర్య కఠోర వ్యాయమాం చేసి కండలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంలో షూటింగ్‌ స్పాట్‌లో దర్శకుడు పా. రంజిత్‌తో ఆర్య బాక్సింగ్‌ చేస్తున్నట్టుగా ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో విడుదలయ్యాయి. ఈ చిత్రంలో విలన్‌గా ప్రముఖ దర్శకుడు మగిళ్‌తిరుమేని నటిస్తున్నారు. విలన్‌తో ఆర్య ఏ విధంగా బాక్సింగ్‌ చేయాలన్న విషయమై దర్శకుడు పా. రంజిత్‌ షూటింగ్‌ స్పాట్‌లో శిక్షణ ఇచ్చారని, ఆ సందర్భంగా తీసిన ఫొటోలే సోషల్‌మీడియాలో వచ్చాయని సినీ యూనిట్‌ సభ్యులు తెలిపారు.


Updated Date - 2020-11-04T22:23:55+05:30 IST

Read more