ఇప్పటికీ ఆమె పాటే తెలుగువారికి మేలుకొలుపు

ABN , First Publish Date - 2020-11-13T04:25:46+05:30 IST

తెలుగునేలపైన ప్రతీ సంగీత ప్రియునికీ సుపరిచితమైన పేరు పి.సుశీల. ఆమె పాట తెలుగువారికి మేలుకొలుపు... చిత్రసీమకు మేలి మలుపు. నవంబర్ 13న

ఇప్పటికీ ఆమె పాటే తెలుగువారికి మేలుకొలుపు

తెలుగునేలపైన ప్రతీ సంగీత ప్రియునికీ సుపరిచితమైన పేరు పి.సుశీల. ఆమె పాట తెలుగువారికి మేలుకొలుపు... చిత్రసీమకు మేలి మలుపు. నవంబర్ 13న గానకోకిల సుశీల పుట్టినరోజు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ సుశీల పంచిన మధురామృతం గురించి చెప్పుకుందాం. పి.సుశీల గళంలో జాలువారిన ప్రతి పదం అమృతమయమై అమరానందం పంచుతోంది. ఆమె పంచిన మధురామృతం తెలుగువారికి నిత్యస్మరణీయం. అంతెందుకు ఈ నాటికీ తెలుగునేలపైన దేవాలయాలలో సుశీల గానం పల్లవిస్తూనే జనానికి మేలుకొలుపు పాడుతూనే ఉందంటే అతిశయోక్తి కాదు. సుశీలామృతం సేవించిన వారందరికీ అమితారోగ్యం అనే నానుడి ఉంది. కరోనా కల్లోలసమయంలో సుశీలామృతం సేవించడం మరింత ఆరోగ్యకరం.


పి.సుశీల కీర్తి కిరీటంలో ఎన్నెన్నో రత్నాలు పొదిగి ఉన్నాయి. ఉత్తమగాయనిగా జాతీయ అవార్డు అందుకున్న తొలి గాయని పి.సుశీల. ఆ పై మరో నాలుగుసార్లు తన గానంతో నేషనల్ అవార్డును అందుకున్నారామె.  ఉత్తరాది గానకోకిలలకు ఏ మాత్రం తీసిపోని సుశీల గానానికి కేంద్రప్రభుత్వం ఏ నాడూ సరైన గౌరవం ఇవ్వలేదనే ఆమె అభిమానుల ఆవేదన. పుష్కరకాలం క్రితం సుశీల ప్రతిభకు 'పద్మభూషణ్' అవార్డు లభించింది. ప్రజాభిమానం మించిన అవార్డు లేదని భావించే సుశీలమ్మ మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.

Updated Date - 2020-11-13T04:25:46+05:30 IST