ఆకట్టుకుంటున్న `ఒరేయ్ బుజ్జిగా` ట్రైలర్!

ABN , First Publish Date - 2020-09-28T18:07:36+05:30 IST

యంగ్ హీరో రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు విజయ్ కుమార్ కొండ తెరకెక్కించిన చిత్రం `ఒరేయ్ బుజ్జిగా..

ఆకట్టుకుంటున్న `ఒరేయ్ బుజ్జిగా` ట్రైలర్!

యంగ్ హీరో రాజ్‌తరుణ్, హెబ్బా పటేల్, మాళవికా నాయర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు విజయ్ కుమార్ కొండ తెరకెక్కించిన చిత్రం `ఒరేయ్ బుజ్జిగా..`. కేకే రాధామోహన్ నిర్మించిన ఈ చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ `ఆహా`లో అక్టోబర్ 2న విడుదల కానుంది. 


కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ఈ చిత్రం ట్రైలర్‌ను తాజాగా అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య విడుదల చేశాడు. `నాదొక బ్యూటిఫుల్, ఫెంటాస్టిక్, మార్వలెస్ లవ్ స్టోరీ` అనే  డైలాగుతో మొదలైన ఈ  ట్రైలర్ ఆకట్టుకుంటోంది. రాజ్‌తరుణ్ స్టైల్లో ఫుల్ ఎనర్జిటిక్‌గా ఉంది. ఈ సినిమాలో అలనాటి హీరోయిన్ వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి తదితరులు నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు. 
Updated Date - 2020-09-28T18:07:36+05:30 IST