ఆకట్టుకుంటోన్న ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ స‌రిగ‌మగ‌మ సాంగ్

ABN , First Publish Date - 2020-06-29T00:00:25+05:30 IST

‘స‌రిగ‌మ‌గ‌మ‌ గామ హంగామ చేద్దామా, ప‌ద‌నిస‌నిస నీస్సా నీ నీషా..నీద‌మ్మా’ అంటూ హుషారుగా సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేసింది ‘ఒరేయ్ బుజ్జిగా..’ టీమ్. యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్

ఆకట్టుకుంటోన్న ‘ఒరేయ్‌ బుజ్జిగా..’ స‌రిగ‌మగ‌మ సాంగ్

‘స‌రిగ‌మ‌గ‌మ‌ గామ హంగామ చేద్దామా, ప‌ద‌నిస‌నిస నీస్సా నీ నీషా..నీద‌మ్మా’ అంటూ హుషారుగా సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేసింది ‘ఒరేయ్ బుజ్జిగా..’ టీమ్. యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్ హీరోహీరోయిన్లుగా శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మిస్తున్న యూత్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...`. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలకి మంచి స్పందన వస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రం నుండి ‘స‌రిగ‌మ‌ప’ అనే పూర్తి లిరికల్ సాంగ్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. రాజ్‌తరుణ్ ఎన‌ర్జిటిక్ స్టెప్పులు, హెబా ప‌టేల్ అందాలు ఈ పాటలో యూత్‌ని ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ పాట‌కు వ‌న‌మాలి సాహిత్యం అందించ‌గా మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనూప్‌ రూబెన్స్ గానం చేశారు. కుమారి 21ఎఫ్, అంధగాడు, ఈడోరకం ఆడోరకం లాంటి చిత్రాల్లో నటించి ఇటు అందంతో అటు చక్కని అభినయంతో తెలుగు సినిమా ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజ్‌తరుణ్, హెబా ప‌టేల్ క‌లిసి న‌టిస్తోన్న మ‌రో చిత్రం కావ‌డంలో సినిమాపై మంచి అంచ‌నాలు ఉన్నాయి. మ్యాంగో మ్యూజిక్‌ ద్వారా ఈ చిత్రంలోని పాటలు విడుదలవుతున్నాయి. త్వ‌ర‌లో విడుద‌ల తేదిని ప్ర‌క‌టించ‌నున్నారు.


యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌, మాళవిక నాయర్‌ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో కీలక పాత్రలో హెబా పటేల్‌, వాణీ విశ్వనాథ్‌, నరేష్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిళ్ళ, సప్తగిరి, రాజా రవీంద్ర, అజయ్‌ ఘోష్‌, అన్నపూర్ణ, సిరి, జయక్ష్మి, సోనియా చౌదరి, సత్య, మధునందన్‌ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్‌ రూబెన్స్‌, మాటలు: నంద్యాల రవి, ఫోటోగ్రఫీ: ఐ.ఆండ్రూ, ఎడిటింగ్‌: ప్రవీణ్‌ పూడి, డాన్స్‌: శేఖర్‌, ఆర్ట్‌: టి.రాజ్‌కుమార్‌, ఫైట్స్‌: రియల్‌ సతీష్‌, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌: ఎం.శ్రీనివాసరావు(గడ్డం శ్రీను), కో-డైరెక్టర్‌: వేణు కూరపాటి, సమర్పణ: శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌, నిర్మాత: కె.కె.రాధామోహన్‌, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కొండా విజయ్‌కుమార్‌.Updated Date - 2020-06-29T00:00:25+05:30 IST