న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ అంటోన్న ‘బుజ్జిగాడు‌’

ABN , First Publish Date - 2020-12-24T01:13:29+05:30 IST

న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ చెప్పేందుకు రెడీ అయ్యాడు 'బుజ్జిగాడు'.. అదేనండి యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌. ఆయన హీరోగా.. మాళవిక నాయర్‌, హెబాపటేల్‌ హీరోయిన్లుగా నటించిన

న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ అంటోన్న ‘బుజ్జిగాడు‌’

న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ చెప్పేందుకు రెడీ అయ్యాడు 'బుజ్జిగాడు'.. అదేనండి యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌. ఆయన హీరోగా.. మాళవిక నాయర్‌, హెబాపటేల్‌ హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ఒరేయ్‌ బుజ్జిగా..'. శ్రీమతి లక్ష్మీ రాధామోహన్‌ సమర్పణలో శ్రీసత్యసాయి ఆర్ట్స్‌ పతాకంపై కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో కె.కె.రాధామోహన్‌ నిర్మించిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బుజ్జిగా...`. ఈ చిత్రం నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా డిసెంబర్ 31న థియేట‌ర్‌ల‌లో విడుద‌లయ్యేందుకు సిద్ధమైనట్లుగా నిర్మాత కె.కె. రాధామోహన్‌ తెలిపారు. అల్రెడీ ఓటీటీలో విడుదలైన ఈ చిత్రాన్ని ఇయర్‌ ఎండింగ్‌కి టాటా చెప్పేలా.. న్యూ ఇయర్‌కి వెల్‌కమ్‌ చెప్పేలా నిర్మాత థియేటర్లలో విడుదల చేస్తున్నారు.


ఈ సందర్భంగా చిత్ర నిర్మాత కె.కె. రాధామోహన్ మాట్లాడుతూ.. ''న్యూ ఇయర్ కి స్వాగ‌తం ప‌లుకుతూ నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా మా బ్యానర్ లో రాజ్‌ తరుణ్, మాళవిక నాయర్, హెబా ప‌టేల్ ‌హీరోహీరోయిన్లుగా కొండా విజయ్‌కుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్ `ఒరేయ్ బుజ్జిగా..`ను డిసెంబర్ 31న గ్రాండ్‌గా విడుద‌ల‌ చేస్తున్నాం. అంతే కాకుండా డిసెంబర్‌లో రిలీజ్ అయిన మా బెంగాల్ టైగర్ బ్లాక్ బస్టర్ అయింది. బెంగాల్ టైగర్, పంతం.. ఇవన్నీ గురువారం విడుదల అయ్యి హిట్ అవడంతో, ఈ గురువారం డిసెంబర్ 31 కావడంతో 31న రిలీజ్ కన్ఫర్మ్ చేశాం. కొత్త సంవత్సరంలో అందరూ ధియేటర్స్ లో ఒరేయ్ బుజ్జిగా చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాం. న్యూ ఇయర్ లో ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ కలిసి చూడదగ్గ 100 శాతం ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఒరేయ్ బుజ్జిగా చిత్రం. ప్రేక్షకుల్ని బాగా ఎంటర్‌టైన్‌ చేస్తుంది. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ.. అందరూ ఈ చిత్రాన్ని థియేటర్లలో చూస్తారని ఆశిస్తున్నాను.." అని తెలిపారు.

Updated Date - 2020-12-24T01:13:29+05:30 IST