సుశాంత్ కేసు సీబీఐకి అప్పగించడం గొప్ప నిర్ణయం: రవీనా టాండన్

ABN , First Publish Date - 2020-08-07T03:10:06+05:30 IST

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్...

సుశాంత్ కేసు సీబీఐకి అప్పగించడం గొప్ప నిర్ణయం: రవీనా టాండన్

ముంబై: బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నిర్ణయంపై నటి రవీనా టండన్ హర్షం వ్యక్తం చేశారు. సుశాంత్ కేసులో ఇదో కీలకమైన, అత్యవసరమైన మలుపని ఆమె అభిప్రాయపడ్డారు. ‘సుశాంత్ మరణంపై ఇప్పటికే అనేకమంది అనేకరకాలుగా చెబుతున్నారు. అయితే ఆ మిస్టరీని త్వరగా ఛేదించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించడం సంతోషంగా ఉంది. దీనివల్ల నిజాలు కచ్చితంగా వెలుగులోని వస్తాయని అనుకుంటున్నాను. అదే జరిగితే అతడి కుటుంబ సభ్యులు, అభిమానులు, శ్రేయోభిలాషులతో పాటు బాలీవుడ్ కూడా ఎంతగానో సంతోషిస్తుంద’ని రవీనా పేర్కొన్నారు.

Updated Date - 2020-08-07T03:10:06+05:30 IST