సుక్కు ఒక్క హీరోయిన్ సెంటిమెంట్.. మీకర్థమౌతుందా!

ABN , First Publish Date - 2020-04-28T05:07:46+05:30 IST

సంచలన చిత్రాల దర్శకుడు సుకుమార్ తను ఇప్పటి వరకు చేసిన చిత్రాలలో హీరో పక్కన ఒక్క హీరోయిన్‌కు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. ఆయన తీసిన

సుక్కు ఒక్క హీరోయిన్ సెంటిమెంట్.. మీకర్థమౌతుందా!

సంచలన చిత్రాల దర్శకుడు సుకుమార్ తను ఇప్పటి వరకు చేసిన చిత్రాలలో హీరో పక్కన ఒక్క హీరోయిన్‌కు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు. ఆయన తీసిన సినిమాలన్నింటిలోనూ హీరోకి ఒక్కరే హీరోయిన్. ఇంకా చెప్పాలంటే ఇద్దరు హీరోలకు ఒక్కరే హీరోయిన్. ప్రస్తుతం ఆయన అల్లు అర్జున్‌తో చేస్తున్న ‘పుష్ప’ చిత్రంలో రెండవ హీరోయిన్‌ అంటూ టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపించాయి. నివేదా థామస్ ఈ చిత్రంలో బన్నీ సరసన చేసే రెండో హీరోయిన్‌గా సెలక్ట్ అయినట్లుగా కథనాలు వచ్చాయి. అయితే వెంటనే ఆ వార్తలను చిత్రయూనిట్ ఖండించింది. ఈ చిత్రంలో కేవలం రష్మిక మందన్నా మాత్రమేనని, రెండో హీరోయిన్‌కు ఛాన్స్ లేదని చిత్రవర్గాలు అధికారికంగా ప్రకటించాయి.


అయినా సుకుమార్ ఇప్పటి వరకు చేసిన ఏ చిత్రంలోనూ రెండో హీరోయిన్ లేదు. మరి కొత్తగా ఈ రెండో హీరోయిన్ అనే వార్తను ఎవరు పుట్టించారో తెలియదు కానీ.. వెంటనే ఖండించి తన సెంటిమెంట్‌ను సుక్కు మరోసారి తెలియజేశారు. మీకర్థమౌతుందా.. ఈ సినిమాలో రష్మికానే హీరోయిన్ అనేలా వివరణ ఇచ్చారు. సుకుమార్ సినిమాలలో ఉండే గొప్పతనం ఏమిటంటే.. హీరోతో పాటు హీరోయిన్‌కి కూడా అంతే గొప్ప పాత్రను క్రియేట్ చేస్తారు. రంగస్థలం చిత్రంలో చిట్టిబాబు పాత్రకి తీసిపోని విధంగా లచ్చిమి పాత్ర ఉంటుంది. ఈ ఒక్క సినిమా అనే కాదు.. సుకుమార్ దర్శకత్వం వహించిన ప్రతి సినిమాలో హీరోయిన్ పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుంది. కావాలంటే ఓసారి ఫ్లాష్ బ్యాక్‌కి వెళ్లిరండి.. మీకే తెలుస్తుంది. 

Updated Date - 2020-04-28T05:07:46+05:30 IST