నాగబాబు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మరో ఇన్సిడెంట్

ABN , First Publish Date - 2020-08-19T04:37:56+05:30 IST

మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా రామ్ చరణ్‌తో చేసిన చిత్రం ‘ఆరెంజ్’. ఆ సినిమా మిగిల్చిన నష్టాలతో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా

నాగబాబు ఆత్మహత్య చేసుకోవాలనుకున్న మరో ఇన్సిడెంట్

మెగా బ్రదర్ నాగబాబు నిర్మాతగా రామ్ చరణ్‌తో చేసిన చిత్రం ‘ఆరెంజ్’. ఆ సినిమా మిగిల్చిన నష్టాలతో ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయనే కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పారు. ఆ తర్వాత చిరు, పవన్ ఆదుకోవడంతో మళ్లీ నిలబడగలిగానని చెప్పే ఆయన మరో సందర్భంలోనూ ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారట. ఈ విషయం తాజాగా ఆయన బుల్లితెరపై ప్రసారం కాబోతోన్న ఓ కార్యక్రమంలో తెలిపారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అందులో నాగబాబు ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నారో వివరంగా చెప్పారు.


‘‘ఓసారి ఫ్యామిలీతో కలిసి న్యూజిలాండ్ వెళ్లాను. అప్పుడు నేను అనుకుని నాలాగే డ్రస్ వేసుకున్న అతనితో నిహారిక వెళ్లిపోయింది. దాదాపు 20 నిమిషాల పాటు నిహారిక ఆచూకీ తెలియలేదు. నాలో ఆందోళన మొదలైంది. అప్పుడు ఆ దేశంలో ఉన్న వారందరినీ చంపేయాలన్నంత కోపం వచ్చేసింది. వరుణ్ బాబుని ఇంటికి పంపించేసి.. నా భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలని కూడా అనుకున్నా. నిహారిక అంటే అంత ఇష్టం. ఎంతో పుణ్యం చేసుకుంటేగానీ నిహారిక లాంటి ఏంజెల్స్ పుడతారు. నిహారిక నాకు ఏంజెల్.. ’’ అంటూ నాగబాబు చెప్పుకొచ్చారు.Updated Date - 2020-08-19T04:37:56+05:30 IST