సౌత్‌లో మహేష్ బాబే టాప్

ABN , First Publish Date - 2020-07-03T00:48:08+05:30 IST

సూపర్ స్టార్ మహేష్ బాబు అకౌంట్‌లో మరో రికార్డ్ నమోదైంది. వాస్తవానికి ఆయనకు రికార్డులు కొత్తకానప్పటికీ.. ఇది మాత్రం రేర్ రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సౌత్‌లో

సౌత్‌లో మహేష్ బాబే టాప్

సూపర్ స్టార్ మహేష్ బాబు అకౌంట్‌లో మరో రికార్డ్ నమోదైంది. వాస్తవానికి ఆయనకు రికార్డులు కొత్తకానప్పటికీ.. ఇది మాత్రం రేర్ రికార్డ్ అనే చెప్పుకోవాలి. ఎందుకంటే సౌత్‌లో ఇప్పుడు ఆయన నెంబర్ వన్ స్టార్. ఎలా అంటే సోషల్ మీడియా ట్విట్టర్‌లో ఏ స్టార్ హీరోకి లేని ఫాలోవర్స్ సంఖ్యని మహేష్ అధిగమించాడు. ఇప్పుడాయనని ట్విట్టర్‌లో 10 మిలియన్స్ అంటే కోటి మంది ఫాలో అవుతున్నారు.


మహేష్ బాబుతో పోల్చుకుంటే సౌతిండియాలో ఈ ఘనత ఏ స్టార్‌కి లేకపోవడం విశేషం. రజినీకాంత్, కమల్ హాసన్ వంటి వారికి కూడా 10 మిలియన్ ఫాలోవర్స్ లేరు. అయితే ఈ మధ్య సినిమా షూటింగ్స్ లేకపోవడంతో.. మహేష్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటున్న విషయం తెలిసిందే. సినిమా విషయాలతో పాటు తన ఇంట్లోని విషయాలు, అలాగే కరోనాపై జాగ్రత్తలు ఇలా ఏదో ఒకదానిపై స్పందిస్తూ.. మహేష్ ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్న స్టార్ హీరోగా కూడా మహేష్ నిలవడం విశేషం. త్వరలోనే ఆయన నటించనున్న ‘సర్కారు వారి పేట’ సెట్స్‌పైకి వెళ్లనుంది.   

Updated Date - 2020-07-03T00:48:08+05:30 IST