ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ మూవీ.. ఇదిగో మరో హింట్

ABN , First Publish Date - 2020-06-05T02:29:49+05:30 IST

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసే సినిమాల విషయంలో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో

ఎన్టీఆర్‌తో ప్రశాంత్ నీల్ మూవీ.. ఇదిగో మరో హింట్

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేసే సినిమాల విషయంలో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయిన వెంటనే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా ఉంటుందనేది ఇప్పటికే అధికారికంగా బయటికి వచ్చింది. ఇక ఈ సినిమాతో పాటే మరో సినిమా కూడా ఎన్టీఆర్ చేసేందుకు రెడీ అయినట్లుగా కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. అధికారికంగా అయితే రాలేదు కానీ.. దర్శకుడు, నిర్మాణ సంస్థ మాత్రం పక్కాగా సినిమా ఉండబోతోంది అనేలా చిన్న చిన్న హింట్స్ వదులుతున్నారు. ఇంతకీ ఆ దర్శకుడు, నిర్మాణ సంస్థ ఏమిటని అనుకుంటున్నారా? ‘కేజీఎఫ్’ చిత్రంతో ఒక్కసారిగా పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయిన ప్రశాంత్ నీల్ ఆ డైరెక్టర్ కాగా, నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్.


డైరెక్టర్ ప్రశాంత్ నీల్ పుట్టినరోజు (జూన్ 04)ను పురస్కరించుకుని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. సేమ్ టు సేమ్ ఎన్టీఆర్ బర్త్‌డే రోజు ప్రశాంత్ నీల్ ఏదైతే ట్వీట్‌లో పేర్కొన్నాడో అదే విషయాన్ని హైలెట్ చేశారు. ‘రేడియేషన్ సూట్’ అనేది వీరిద్దరి ట్వీట్స్‌లో వినిపించిన కామన్ హింట్. దీంతో.. ఖచ్చితంగా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఉంటుందని, త్వరలోనే అధికారిక ప్రకటన రానుందనేది టాలీవుడ్ సర్కిల్ అంతా కన్ఫర్మ్ అయింది.Updated Date - 2020-06-05T02:29:49+05:30 IST