సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణలో ‌`ఓదెల రైల్వేస్టేష‌న్`

ABN , First Publish Date - 2020-10-30T21:39:09+05:30 IST

ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ` ఓదెల రైల్వేస్టేష‌న్`. ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.

సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణలో ‌`ఓదెల రైల్వేస్టేష‌న్`

ద‌ర్శ‌కుడు సంప‌త్‌నంది క‌థ‌, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌తో  శ్రీ‌మ‌తి ల‌క్ష్మీ రాధామోహ‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాత‌ కె.కె.రాధామోహ‌న్ నిర్మిస్తోన్న డిఫ‌రెంట్ క్రైమ్ థ్రిల్ల‌ర్ ` ఓదెల రైల్వేస్టేష‌న్`. ఈ చిత్రం ద్వారా అశోక్ తేజ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యమ‌వుతున్నారు. క‌న్న‌డ‌లో 25 చిత్రాల‌కు పైగా న‌టించిన వ‌శిష్ట సింహ తెలుగులో హీరోగా న‌టిస్తోన్న మొద‌టి సినిమా ఇది. ఈ చిత్రంలో ప‌ల్లెటూరి అమ్మాయిగా ఒక వైవిద్య‌మైన పాత్ర‌లో హీరోయిన్ హెభా ప‌టేల్ న‌టిస్తోంది.  ‘ఓదెల’ అనే గ్రామంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఓ వైవిధ్యభరిత క్రైమ్‌ థ్రిల్లర్‌ కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోంది. క‌రోనా వ్యాప్తి నేప‌థ్యంలో అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఓదెలలో మొద‌టి షెడ్యూల్ పూర్తిచేసింది చిత్ర యూనిట్‌. షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ఇప్ప‌టికే హైద‌రాబాద్‌లో డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు కూడా ప్రారంభ‌మ‌య్యాయి.   ఇటీవ‌ల కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా షూటింగ్ కి కొంత గ్యాప్ ఇచ్చిన చిత్ర‌యూనిట్ అక్టోబర్‌ 30 నుండి రెండో షెడ్యూల్ షూటింగ్‌కి రెడీ అయ్యింది. ఈ సంద‌ర్భంగా..

చిత్ర నిర్మాత కె.కె. రాధా మోహ‌న్ మాట్లాడుతూ ''తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వ‌ర్షాల కార‌ణంగా నిలిపిన ఓదెల రైల్వేస్టేషన్ సెకండ్ షెడ్యూల్ ఈ రోజు ప్రారంభమైంది. ఈ షెడ్యూల్‌లో చిత్రంలోని కొన్ని కీల‌క‌మైన‌ స‌న్నివేశాల‌తో పాటు  క్లైమాక్స్‌ను చిత్రీక‌రించ‌నున్నాం. ఇప్ప‌టికే డబ్బింగ్ కార్య‌క్ర‌మాలు మొద‌ల‌య్యాయి. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి త్వ‌ర‌లో మీ ముందుకు తీసుకువ‌స్తాం" అన్నారు. Updated Date - 2020-10-30T21:39:09+05:30 IST