‘ఓ పిట్టకథ’: ఇది మన సినిమా ట్రైలర్ కాదు

ABN , First Publish Date - 2020-02-02T01:00:42+05:30 IST

విశ్వంత్, సంజయ్‌రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. చందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్

‘ఓ పిట్టకథ’: ఇది మన సినిమా ట్రైలర్ కాదు

విశ్వంత్, సంజయ్‌రావు, నిత్యాశెట్టి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఓ పిట్టకథ’. చందు ముద్దు దర్శకత్వంలో భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో బ్రహ్మాజీ నటించారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రి టీజర్‌ను నేడు చిత్రబృందం విడుదల చేసింది. ఈ ప్రి టీజర్‌ను రానా దగ్గుబాటి రిలీజ్ చేశాడు.


అదిరిపోయే యాక్షన్ సీన్‌తో ఈ సినిమా ప్రి టీజర్ ప్రారంభమవుతోంది. సన్నివేశాలకు, సినిమా పేరుకు సంబంధం లేదేంటా అనుకునే లోపు.. ‘ఇక చాల్లే ఆపు.. ఇది మన సినిమా ట్రైలర్ కాదు.. నెక్ట్స్ వచ్చే సినిమా ట్రైలర్. మన సినిమా టీజర్, ట్రైలర్.. కమింగ్ సూన్’ అని హీరోయిన్‌కు చెప్పే సీన్‌తో ఈ సినిమా ప్రి టీజర్ ముగుస్తుంది. ఈ సినిమా టీజర్ ఈ నెల 7న విడుదల కానుంది.

Updated Date - 2020-02-02T01:00:42+05:30 IST