కోహ్లీ సాయంతో అనుష్క శీర్షాసనం!

ABN , First Publish Date - 2020-12-01T18:38:30+05:30 IST

మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు.

కోహ్లీ సాయంతో అనుష్క శీర్షాసనం!

మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ దంపతులు త్వరలో తల్లిదండ్రులు కాబోతున్నారు. మరో నెల రోజుల్లో అనుష్క ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతోంది. గర్భవతిగా ఉన్నప్పటికీ అనుష్క వ్యాయామం, యోగాను ఆపలేదు. కఠినమైన శీర్షాసనం కూడా వేసింది. 


కొద్ది రోజుల కిందటి ఆ ఫొటోను అనుష్క తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. కోహ్లీ సహాయంతో అనుష్క శీర్షాసనం వేసింది. `నా జీవితంలో యోగాకు చాలా ప్రాధాన్యం ఉంది. కాబట్టి గర్భంతో ఉన్నప్పటికీ యోగా చేసుకోవచ్చిన వైద్యులు సూచించారు. దాంతో ఇంతకుముందులాగానే అన్ని ఆసనాలూ వేస్తున్నాను. నా ప్రియమైన భర్త కోహ్లీ సాయంతో శీర్షాసనం కూడా వేశాన`ని అనుష్క తెలిపింది. ఆన్‌లైన్ ద్వారా తన యోగా గురువు పర్యవేక్షణలోనే ఆసనాలు వేస్తున్నట్టు పేర్కొంది. Updated Date - 2020-12-01T18:38:30+05:30 IST

Read more