అమెరికాలో ఎన్టీఆర్‌30?

ABN , First Publish Date - 2020-10-18T06:45:24+05:30 IST

రాయలసీమ ఫ్యాక్షన్‌ కక్షలు, తగాదాల నేపథ్యంలో ‘అరవింద సమేత వీరరాఘవ’ రూపొందింది. ఆ చిత్రం తర్వాత మరోసారి కథానాయకుడు ఎన్టీఆర్‌, దర్శకుడు త్రివిక్రమ్‌...

అమెరికాలో ఎన్టీఆర్‌30?

రాయలసీమ ఫ్యాక్షన్‌ కక్షలు, తగాదాల నేపథ్యంలో ‘అరవింద సమేత వీరరాఘవ’ రూపొందింది. ఆ చిత్రం తర్వాత మరోసారి కథానాయకుడు ఎన్టీఆర్‌, దర్శకుడు త్రివిక్రమ్‌ కలిసి పని చేయనున్న సంగతి తెలిసిందే. రాయలసీమ నేపథ్యంలో ‘అరవింద...’ తీసిన త్రివిక్రమ్‌, ఈసారి చేయబోయే చిత్రానికి అమెరికా నేపథ్యం ఎంచుకున్నారట. కుటుంబ విలువలతో పాటు పాశ్చాత్య అంశాలకు చిత్రకథలో త్రివిక్రమ్‌ చోటు కల్పించారట. గత చిత్రానికి పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉండబోతుందట. హీరోకి 30వ చిత్రమిది. ప్రస్తుతం ‘ఆర్‌ఆర్‌ఆర్‌: రౌద్రం రణం రుధిరం’ చిత్రీకరణలో ఎన్టీఆర్‌ పాల్గొంటున్నారు. అది పూర్తి చేశాక త్రివిక్రమ్‌ సినిమా ప్రారంభించాలని ఆలోచిస్తున్నట్టు సమాచారం. వచ్చే సంవత్సరం సెట్స్‌ మీదకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఎన్టీఆర్‌ చిత్రం కాకుండా మహేశ్‌బాబుతో మూడో చిత్రం చేయడానికి త్రివిక్రమ్‌ సిద్ధమవుతున్నారు.

Updated Date - 2020-10-18T06:45:24+05:30 IST