నాలో అభిమానిని తట్టి లేపింది మీరే: బాలయ్యకు ఎన్టీయార్ విషెస్

ABN , First Publish Date - 2020-06-10T15:16:59+05:30 IST

తనకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో నటరత్న నందమూరి బాలకృష్ణేనని యంగ్ టైగర్ ఎన్టీయార్ తెలిపాడు.

నాలో అభిమానిని తట్టి లేపింది మీరే: బాలయ్యకు ఎన్టీయార్ విషెస్

తనకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో నటరత్న నందమూరి బాలకృష్ణేనని యంగ్ టైగర్ ఎన్టీయార్ తెలిపాడు. ఈ రోజు (బుధవారం) బాలకృష్ణ జన్మదినోత్సవం. ఈ సందర్భంగా బాలయ్యకు ఎన్టీయార్ ట్విటర్ ద్వారా జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశాడు. 


`నాలోని అభిమానిని తట్టి లేపింది మీరే. నాకు ఊహ తెలిశాక చూసిన మొట్టమొదటి హీరో మీరే. ఈ 60వ పుట్టినరోజు మీ జీవితంలో మరపురానిది కావాలని, మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. హ్యాపీ బర్త్‌డే బాబాయ్. జై బాలయ్య` అంటూ ఎన్టీయార్ ట్వీట్ చేశాడు. 




Updated Date - 2020-06-10T15:16:59+05:30 IST