యన్టీఆర్ ‘సరదా రాముడు’కు 40 ఏళ్ళు

ABN , First Publish Date - 2020-11-14T03:44:41+05:30 IST

నటరత్న యన్టీఆర్ హీరోగా రూపొందిన 'సరదా రాముడు' నవంబర్ 14తో నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు

యన్టీఆర్ ‘సరదా రాముడు’కు 40 ఏళ్ళు

నటరత్న యన్టీఆర్ హీరోగా రూపొందిన 'సరదా రాముడు' నవంబర్ 14తో నలభై ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది.ఈ సందర్భంగా ఆ చిత్ర విశేషాలను గుర్తు చేసుకుందాం. ఆ రోజుల్లో నందమూరి తారకరామునితో ఓ చిత్రమైనా తీయాలని నిర్మాతలు ఉవ్విళ్ళూరేవారు. ఇక దర్శకులు నటరత్నతో ఓ సినిమా చేసినా జన్మధన్యం అని భావించేవారు. అలాంటి సమయంలో ఎస్.రియాజ్ ఖాన్ అనే అభిమాని యన్టీఆర్ తో సినిమా తీయాలని గట్టి ప్రయత్నం చేశాడు. అప్పట్లో యేడాదికి ఆరేడు చిత్రాల్లో నటిస్తున్నారు యన్టీఆర్. దాంతో ఓ రోజున డేట్స్ అడ్జెస్ట్ చేసి యన్టీఆర్, రియాజ్ ఖాన్ కు సినిమా చేస్తానన్నారు. ఉక్కిరిబిక్కిరి అయిపోయిన రియాజ్ ఖాన్ సరైన సమయానికి కథ సిద్ధం చేసుకోలేక పోయి, హిందీలో అంతకు ముందు విజయం సాధించిన 'జంగ్లీ'ని రీమేక్ చేయాలని నిశ్చయించాడు. అదే 'సరదారాముడు'గా జనం ముందు నిలచింది. కె.వాసు దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి చక్రవర్తి సంగీతం ఎస్సెట్. జయసుధ ఈ చిత్రంలో నాయికగా నటించారు.


'సరదా రాముడు' చిత్రాన్ని 1980లో దసరా కానుకగా విడుదల చేయాలని ప్రయత్నించాడు నిర్మాత. అయితే ఆ యేడాది ఆదివారం దసరా రావడంతో మరో డేట్ కోసం పోస్ట్ పోన్ చేసుకున్నాడు. ఈ లోగా యన్టీఆర్ 'సర్దార్ పాపారాయుడు' కూడా విడుదలకు ముస్తాబయింది. దాంతో రియాజ్ ఖాన్ తన 'సరదా రాముడు'ను ఓ రెండు వారాలు వాయిదా వేసుకున్నాడు. కొన్ని ఊళ్ళలో 'సరదా రాముడు' వస్తుందనే వాల్ పోస్టర్స్ కూడా వెలిశాయి. అయితే అనూహ్యంగా 'సర్దార్ పాపారాయుడు' ముందుగా విడుదలయింది. ఆ సినిమా సాధించిన ఘనవిజయం గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ గ్రాండ్ సక్సెస్ ముందు 'సరదా రాముడు' గల్లంతయింది. ఇందులోని పాటలు మాత్రం భలేగా అలరించాయి. 

Updated Date - 2020-11-14T03:44:41+05:30 IST