కుర్చీలపై నిర్మాతలు.. నేలపై ఎన్టీయార్, ఏఎన్నార్!

ABN , First Publish Date - 2020-05-26T17:08:36+05:30 IST

ప్రస్తుతం సినీ పరిశ్రమలో నిర్మాతలకు దక్కుతున్న గౌరవం గురించి రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.

కుర్చీలపై నిర్మాతలు.. నేలపై ఎన్టీయార్, ఏఎన్నార్!

`ఏ రంగంలోనైనా డబ్బు పెట్టుబడి పెట్టే వాడికే ఎక్కువ గౌరవం లభిస్తుంది.. కానీ, సినిమా రంగంలో మాత్రం పూర్తి భిన్నంగా ఉంటుంది` అని కొందరు నిర్మాతలు తమ పరిస్థితి గురించి ఇప్పటికే చాలాసార్లు వివరించారు. నిర్మాత పరిస్థితి క్యాషియర్ స్థాయికి దిగజారిపోయిందని, హీరోలు, దర్శకుల ముందు చేతులు కట్టుకుని నిలబడాల్సిందేనని కొందరు నిర్మాతలు తరచుగా వాపోతూ ఉంటారు.


చెక్కుల మీద సంతకాలు పెట్టడం తప్ప నిర్మాత అభిప్రాయానికి కనీసం విలువ ఉండదని అసంతృప్తి వ్యక్తం చేస్తుంటారు. అయితే పాత కాలంలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉండేదట. ఎస్వీఆర్, ఎన్టీయార్, ఏఎన్నార్ వంటి స్టార్ హీరోలు సైతం నిర్మాతలకు సముచిత గౌరవం ఇచ్చేవారట. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోయే దానికి నిదర్శనం. నిర్మాతలు కుర్చిల్లో కూర్చుని ఉంటే, ఎన్టీయార్, ఏఎన్నార్ నేలపై కూర్చుని మాట్లాడుకుంటున్నారు. అప్పట్లో స్టార్ హీరోలు సైతం విజయ, వాహినీ వంటి సంస్థలకు నెల జీతాలకు పనిచేసేవారు. 

Updated Date - 2020-05-26T17:08:36+05:30 IST